twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్నూ కబ్జా చేస్తారన్న దాసరి, కుల ప్రస్తావన!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చేతికి మైకు దొరికితే చాలు...ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే దర్శకరత్న దాసరి నారాయణరావు తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఎస్వీ రంగారావుపై సినీ పాత్రకేయుడు పసుపులేటి రామారావు రచించిన ‘ఒకే ఒక్కడు..యశస్వి ఎస్వీ రంగారావు' పుస్తకావిష్కరణలో పాల్గొన్న దాసరి వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తొలి ప్రతిని కైకాల సత్యనారాయణ అందుకోగా తొలి ప్రతిని బిఏరాజు దంపతులు, మలి ప్రతిని సురేష్ కొండేటి కొనుగోలు చేసారు.

    ఈ కాలంలో భూములే కాకుండా చరిత్రలను కూడా కబ్జా చేస్తున్నారు. తమిళంలో ఎమ్‌జీఆర్ తర్వాత ఆ స్థాయిలో తన అభినయంతో గొప్ప పేరును సంపాదించుకున్నారు కాంతారావు. అలాంటి నటుడి గురించి ఎవరికీ తెలియకుండా చేశారు. కొన్నాళ్లయితే నా చరిత్రను కబ్జా చేస్తారు అని అన్నారు దాసరి నారాయణరావు. చరిత్ర లేకపోతే గొప్పవ్యక్తుల గురించి ఎవరికీ తెలియదు. మనదేశం సినిమాతో ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఘంటసాలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన కృష్ణవేణి గురించి నేటి తరంలో ఎవరికీ తెలియదు. ఆమె గొప్పతనాన్ని తెలియకుండా చేసి ఎన్టీఆర్‌ను తామే పరిచయం చేశామంటూ ఇండస్ట్రీ చరిత్రను ఎవరికీ వారే దాచిపెడుతున్నారు. కులం పేరు ఉందని రఘుపతి వెంకయ్య లోంచి నాయుడుని తొలగించారు. బి. నాగిరెడ్డి, కె.వి.రెడ్డిలకు మాత్రం కులం పేరు అడ్డురాలేదు.

    SV Ranga Rao Book Launch

    వ్యాపారం కోసం స్టూడియోలు నిర్మించుకొని చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకువచ్చింది మేమే అని కొందరు గొప్పలు చెప్పుకుంటున్నారు అని అన్నారు. అలాగే ఎస్వీఆర్ గురించి ఆయన మాట్లాడుతూ ఎస్వీ రంగారావు నాకు దైవంతో సమానం. నేను తొలిసారి దర్శకత్వం వహించిన తాతా మనవడు చిత్రంలో ఆయనే కథానాయకుడు. దర్శకుడిగా నాకు పేరుప్రఖ్యాతులు రావటానికి రంగారావే కారణం. ఏ పాత్రలో నైనా పరకాయ ప్రవేశం చేసేవారాయన. భారతదేశం నుంచి అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఏకైక నటుడు ఎస్వీఆర్. ఆయన వద్ద శిష్యరికం చేశాను. ఎస్వీఆర్ మరణించి నలభై ఏళ్లయిన అభిమానుల గుండెల్లో మాత్రం ఎప్పటికీ నిలిచేవుంటారు. ప్రభుత్వాలు, ఇండస్ట్రీ మరిచినా చరిత్రకారుల మాత్రం ఆయన్ని మరువలేదు. ఆయన జీవిత చరిత్రపై ఓ పుస్తకం రావటం ఆనందందాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, ఆర్. నారాయణమూర్తి, గీతాంజలి, పసుపులేటి రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి గోపాల కృష్ణ, సారిపల్లి కొండలరావు, బి. జయ, మాదాల రవి తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Senior Journalist Pasupuleti Rama Rao’s SV Ranga Rao Samagra Cine Jeevitham Book Launch event held at Hyderabad. Kaikala Satyanarayana, Brahmanandam, Dasari Narayana Rao, Suresh Kondeti, R Narayana Murthy, B Jaya, Tammareddy Bharadwaja, Paruchuri Gopala Krishna graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X