ఎస్వీ రంగారావు వచ్చేస్తున్నాడు

చిత్రం గురించి మాట్లాడుతూ... ఎస్.ఆర్.చరణ్‌రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని మా బేనర్‌లో నిర్మిస్తున్నాం. మా తాతగారి పేరు కలకాలం గుర్తిండిపోయేలా 'ఎస్వీఆర్ సినీ కార్పొరేషన్' పేరుతో చిత్రాలు నిర్మిస్తున్నారు. మా తాతగారు ఉన్నప్పుడే చిన్నతాతగారు జగ్గారావు నటిస్తుండేవారు. నాన్న గారు కోటేశ్వరరావు కుటుంబవ్య వహారాలు, వ్యాపాలు చూసుకుంటేవారు. మా తమ్ముడు ఎస్వీ రంగారావు హీరోగా, ముంబై నటి నీలమ్ ఉపాధ్యారు హీరోయిన్‌గా నటిస్తున్నఈ చిత్రం నేటినుంచి ఏకధాటిగా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయింది. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తోసాగే ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయనున్నామని తెలిపారు.
ఇంకా ఈ చిత్రంలో ఎం.ఎస్.నారాయణ, శ్రీనివాసరెడ్డి, ఏవీఎస్,గుండు హనుమంతరావు, పృథ్వీ, సుప్రీత్ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: ప్రదీప్ సిహెచ్. కెమెరా: ప్రభాకర్‌రెడ్డి, సంగీతం: మున్నాకాశి, నిర్మాతలు: ఎస్వీఆర్ బ్రదర్స్, దర్శకత్వం: ఎస్.ఆర్. చరణ్‌రెడ్డి.


Click it and Unblock the Notifications











