100 ఏళ్ల సినిమా సంబరం : ఎస్వీఆర్, అల్లు, భానుమతిలపై పోస్టల్ స్టాంపులు
హైదరాబాద్ : భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ వందేళ్లలో సినిమా రంగానికి ఎనలేని సేవ చేసిన 50 మంది ప్రముఖులను ఎంపిక చేసి వారి ఫోటోలతో పోస్టల్ స్టాంపులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ముగ్గురు ప్రముఖులకు స్థానం దక్కింది.
తెలుగు తెరపై తమ నటనావైభవంతో ఓ వెలుగు వెలిగిన ప్రముఖ నటులు ఎస్వీ రంగారావు, భానుమతి, అల్లు రామలింగయ్యలు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 50 మందిలో చోటు దక్కించుకున్నారు. ముగ్గురు తెలుగు వారికి ఈ గౌరవం దక్కడంపై తెలుగు సినీ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. జూన్ నెల నుంచి ఈ స్టాపులు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో స్టాంపు విలు రూ. 5గా నిర్ణయించారు.
ఈ గౌరవానికి ఎంపికైన ఇతర భాషా సినీ రంగాలకు చెందిన నటుల వివరాలు :
అశోక్ కుమార్, బాల్జీ పెండార్కర్, ధీరేంద్రనాథ్ గంగూలీ, బిఎన్ సిర్‌కార్, భూపెన్ హజారికా, దుర్గా కోటె, బిఆర్ చోప్రా, దేవానంద్, హృషికేష్ ముఖర్జీ, మజ్దూర్ సుల్తాన్ పురి, నౌషాద్, నితిన్ బోస్, పృథ్వీరాజ్ కపూర్, రాయ్ చంద్ బోరల్, రూబీ మైరిస్, సోహ్రబ్ మోడి, పతన్ సిన్హా, యష్ చోప్రా, బాలరాజ్ షాహిని, సివి శ్రీధర్, కమాల్ అమ్మోహి, అశోక్ మెహతా, చేతన్ ఆనంద్, గీతా దత్, కన్న దాసన్, మెహమూద్, నాగేష్, ప్రేమ్ నాజిర్, మదన్ మోహన్, మోతిలాల్, ఓపి నయ్యర్, ఆర్.డి. బర్మన్, రాజ్ కోస్లా, రాజేష్ ఖన్నా, సలీల్ చౌదరి, శైలేంద్ర, రాజేంద్ర కుమార్, సంజీవ్ కుమార్, షకీల్ బదయూని, షమ్మి కపూర్, స్మితా పాటిల్, తారాచంద్ బర్జాత్య, ఉత్పల్ దత్, శంకర్ జైకిషన్, సూరైయా, టిఆర్ సుందరమ్, విష్ణు వర్ధన్.

విడుదలైన పోస్టల్ స్టాంపుల దృశ్యాలు

విడుదలైన పోస్టల్ స్టాంపుల దృశ్యాలు

విడుదలైన పోస్టల్ స్టాంపుల దృశ్యాలు

విడుదలైన పోస్టల్ స్టాంపుల దృశ్యాలు

విడుదలైన పోస్టల్ స్టాంపుల దృశ్యాలు


Click it and Unblock the Notifications











