జులై 3న యస్వీఆర్ శతజయంతి వేడుకలు.. ఉపరాష్ట్రపతి హాజరు!
వెండితెర విలక్షణ నటుడు యస్.వి.ఆర్. శతజయంతి వేడుకలు జులై 3న జరగనున్నాయని సంగమం ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు, సినీ పరిశోధకులు సంజయ్ కిశోర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. మహానటుడు యస్.వి.రంగారావుగారి శతజయంతి సంవత్సరమిది. ఈ సందర్భంగా మా సంగమం సంస్థ హైదరాబాద్‌లో యస్.వి.రంగారావు శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనుంది.

యస్.వి.రంగారావు శతజయంతి వేడుకలను రంగారావుగారి జన్మదినమైన జులై మూడో తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహిస్తాం. శ్రీ మండలి బుద్ధ ప్రసాద్‌గారు, కె.వి. రమణ చారిగార్ల నేతృత్వంలో ఏర్పాటైన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడుగారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. శతజయంతి వేడుకల సభలో యస్.వి.రంగారావుగారితో కలిసి నటించిన అలనాటి నటీనటులను సత్కరిస్తాం. అలాగే యస్.వి.ఆర్. తరువాతి తరాలలో పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ నటీనటులను కూడా ప్రత్యేకంగా సత్కరిస్తాం అని అన్నారు.


Click it and Unblock the Notifications