twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘నాయక్’ను తలదన్నేలా ‘సీతమ్మ వాకిట్లో...’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'నాయక్' చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికాలో రికార్డు స్థాయిలో 100 పై చిలుకు థియేటర్లలో రిలీజ్ చేసేందుకు యూనివర్శల్ మీడియా సంస్థ, ప్రణీత్ మీడియా సంస్థ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అమెరికా-కెనడా వ్యాప్తంగా మొత్తం 102 స్ర్కీన్లలో ఓపెనింగ్ డే రిలీజ్‌కు ఏర్పాట్లు చేసారు.

    అయితే 'నాయక్' చిత్రానికి పోటీగా సంక్రాంతి బరిలో నిలిచిన మహేష్ బాబు-వెంకటేష్ మల్టీ స్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం అమెరికాలో దానికంటే ఎక్కువ థియేటర్లను సొంతం చేసుకుంది. 14 రీల్స్ సంస్థ FICUS సంస్థతో అమెరికా-కెనడా వ్యాప్తంగా మొత్తం 109 స్క్రీన్లలో రిలీజ్ కు ఏర్పాటు చేసారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఈ రేంజిలో భారీ ఎత్తున విడుదల కాలేదు.

    ఈ నెల 11న తేదీన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విడుదలవుతోంది. . అయితే ఆ రోజు అమావాస్య అవుతుండటంతో ముందు రోజు ప్రీమియర్ షోలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోస్టు ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం మరికొన్ని రోజుల్లో సెన్సర్ కార్యక్రమాలు పూర్తి చేసుకోబోతోంది.

    సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి వెన్నెల సీతారామశాస్త్రి.

    English summary
    For the first time Mahesh Babu and Venkatesh are featuring in a true multi-starrer Telugu movie Seethamma Vakitlo Sirimalle Chettu. The movie releasing in 109 screens in USA and Canada. This is a record among Telugu releases in USA. 14 Reels in association with FICUS is going to Big release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X