‘సీతమ్మవాకిట్లో...’50 రోజుల ఫంక్షన్ ..వివరాలు
హైదరాబాద్ : మహేష్,వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 50 రోజులకు దగ్గరపడుతూండటంతో ఘనంగా ఈ వేడుకలను చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మార్చి 3న ఈ ఫంక్షన్ జరగనుంది. హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో జరిగే ఈ వేడుకలో మహేష్ బాబు,వెంకటేష్ ఇద్దరూ పాల్గొనే అవకాసం ఉంది. త్వరలోనే ఈ పంక్షన్ కి సంభందించి పూర్తి వివరాలు వెలబడే అవకాసం ఉంది.
ఇక ఈ చిత్రం దర్శకుడు ... ''హీరోలను డెరైక్ట్ చేస్తున్నట్లు కాకుండ, నిజమైన అన్నదమ్ములనే డెరైక్ట్ చేస్తున్నట్లు భావించి ఈ సినిమా చేశాను. ఈ కథతో ముందుకెళ్ళడానికి వెంకటేష్, మహేష్, దిల్‌రాజు అందించిన సహకారం మరిచిపోలేనిది'' అని శ్రీకాంత్ అడ్డాల తెలిపారు.
ఈ విజయం వెంకటేష్‌దీ, నాదీ అంటున్నారు. కానీ ప్రేక్షకుల విజయం ఇది. శ్రీకాంత్ ఈ కథతో నాలుగేళ్లు ప్రయాణించాడు. ఇలాంటి గొప్ప సినిమా తీయాలనే కోరికకు రాజు ప్రాణం పోశారు. మిక్కీ జె.మేయర్ పాటలు కథను నడిపించాయని మహేష్‌బాబు చెప్పారు. ఆయన ఈ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్తున్నారు.
వెంకటేష్ మాట్లాడుతూ ''నిజ జీవితంలో నేను పెద్దగా మాట్లాడను. ఈ సినిమాలో అలాంటి పాత్రే ఇచ్చాడు దర్శకుడు. నేనో అన్నకు తమ్ముడిని. అయితే ఈ సినిమాతో నేను కూడా అన్నయ్య అయ్యాను. మహేష్‌తో కలసి నటించడం ఓ మంచి అనుభవం'' అన్నారు. దిల్ రాజు ఈ చిత్రం విజయంపై ఉన్న నమ్మకం నెరవేరిందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











