'సీతమ్మవాకిట్లో...' మారిన ఆడియో విడుదల తేది
హైదరాబాద్ : వెంకటేష్, మహేష్‌బాబు కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం ఆడియో విడుదల తేదీని డిసెంబర్ 16 కి ఖరారు చేసారు. నానక్ రామ్ గూడా లో భారీ ఎత్తున ఈ ఆడియోని విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదట ఈ ఆడియోని డిసెంబర్ 15న విడుదల చేద్దామనుకున్నారు. అయితే 16 వ తేదీలో ఏ మార్పు ఉండదని చెప్తున్నారు. జనవరి 11,2013 సంక్రాంతి కానుకగా ఈ కుటుంబ కధా చిత్రం విడుదల అవుతోంది. మిక్కీ జే మేయర్ అందించే సంగీతం సినిమాకు ప్లస్ అవుతుందని చెప్తున్నారు. అడ్డాల శ్రీకాంత్ దర్సకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కచ్చితంగా నా అభిమానులకు,వెంకటేష్ గారి అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. సినిమా చూసి థియోటర్ నుంచి బయిటకు వచ్చే మొహాల్లో సంతోషం కనపడుతుంది. మంచి సినిమా చూసామన్న తృప్తిని ఈ సినిమా ఇస్తుంది..నా కెరీర్లో ఏ సినిమా ఇంతలా ఇష్టపడి చేయలేదు " అంటున్నారు మహేష్ బాబు.
ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లుడుతూ...అన్న కోసం తమ్ముడు అడవులకు వెళ్లితే అది రామాయణం. ఆస్తి కోసం అన్నదమ్ములు తగువుకి దిగితే... అది నేటి భారతం. రక్తం ఎప్పుడైతే పంచుకొని పుట్టారో, అప్పటి నుంచి పంపకాలు అలవాటైపోయాయి. 'అమ్మను నువ్వు చూసుకో - నాన్న నా దగ్గర ఉంటాడు. లేదంటే ఇద్దర్నీ చెరో ఆరు నెలలూ భరిద్దాం' - ఇలాంటి లెక్కలు వింటూనే ఉన్నాం. అందుకే ఉమ్మడి కుటుంబం ముక్కలైపోయింది. ఈ రోజుల్లోనూ ఆస్తుల్ని కాకుండా అనుబంధాల్నీ ఆప్యాయతల్నీ పంచుకొనే సోదరుల్ని మా చిత్రంలో చూపిస్తున్నామన్నారు.
ఆస్తిపాస్తుల ముందు అన్నదమ్ముల బంధాలకు విలువ లేని కాలమిది. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకొంటూ ఎవరి బతుకులు వాళ్లు బతికేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా నాన్న దగ్గర చేసిన వాగ్ధానం కోసం ఆ అన్నదమ్ములు ఏం చేశారో తెర మీదే చూడాలంటున్నారు దిల్ రాజు. ఆయన నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'...అలాగే మల్టీస్టారర్ చిత్రాల్లో ఇదో ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని, అనుబంధాల విలువనీ హృద్యంగా చెప్పే ప్రయత్నమిది అన్నారు . వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా చేస్తున్నారు. సంగీతం: మిక్కీ జే.మేయర్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











