వెంకీ-మహేష్ రియల్ రిలేషన్
హైదరాబాద్ : విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రంలో వెంకీ, మహేష్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సినిమాలోనే కాదు...వీరు రియల్ లైఫ్ లోనూ అదే అనుబంధాన్ని, గౌరవాన్ని మెయింటేన్ చేస్తున్నారు.
తాజాగా అందిన ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ చిత్రం ఆడియోను వెంకీ పుట్టినరోజును పురస్కరించుకుని డిసెంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ డేట్ నిర్ణయించింది నిర్మాతలు కాదట, మహేష్ బాబే స్వయంగా దర్శక నిర్మాత వద్ద ఈ ప్రతిపాదన తెచ్చాడట. దీన్ని బట్ట వీరి మధ్య ఎంత మంచి రిలేషన్ షిప్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక సినిమా విషయానికొస్తే...డిసెంబర్ 21నే సినిమా విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కావడం లేదని..... జనవరి 11, 2013న విడుదల చేస్తారని తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











