For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'సీతమ్మ వాకిట్లో...' ఆడియో రిలీజ్ ఇన్విటేషన్,వెన్యూ సెట్ (ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : వెంకటేష్‌, మహేష్‌బాబు హీరోలుగా నటిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ రోజున (డిసెంబర్ 16న) హైదరాబాద్‌లో ఆడియోని ఘనంగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంభందించి ప్రత్యేకంగా వివిఐపీ పాస్ లను పంపించారు. అలాగే వెన్యూ ని కూడా అద్బుంతంగా సెట్స్ తో అలంకరించారు.

  దిల్ రాజు మాట్లాడుతూ '' హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్డూడియో గ్రౌండ్స్‌లో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఆడియోను విడుదల చేయబోతున్నాం. మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రీతిలోఆడియో వేడుకను నిర్వహిస్తాం. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో పాటల్ని విడుదల చేయబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని వినూత్న శైలిలో నిర్వహిస్తా ము'' అన్నారు.

  .''పేరులోనే కాదు, సినిమాలోనూ తెలుగుదనం కనిపిస్తుంది. ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూపించడం మంచి కథ ఉంటేనే సాధ్యం. అలాంటి కథ ఈ సినిమాలో ఉంది. కుటుంబ విలువలకు పెద్దపీట వేశాము . ఇందులో ఒక్క పాత్ర కూడా వృథాగా ఉండదు. ఒక్క సీన్ వేస్ట్‌గా ఉండదు. అంత పగడ్బందీ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందిస్తున్నాం. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నన్ను దర్శకుడిగా పరిచయం చేసిన ఆయన బేనరులోనే రెండో సినిమా కూడా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్‌, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్‌ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అంటున్నారు.

  వేడుకకు సంభందించిన పాస్,వెన్యూ ఫోటోలు ఇవే.

  ఈ ఎంట్రీ పాస్...వివి ఐపీ ల కోసం ఇచ్చింది. నానక్ రామ్ గూడా రామానాయుడు స్టూడియో లో ఈ ఆడియో వేడుక సాయింత్రం ఏడు గంటలకు ప్రారంభం అవుతుంది.

  ఈ వేడుక కోసం చాలా అద్బుతంగా సెట్ ని వేసారు. తెలుగుతనం ఉట్టిపడేలా...పలు జాగ్రత్తలు తీసుకుని అలంకరిస్తున్నారు. ఈ ఆడియో వేడుక వెంకటేష్,మహేష్ కెరీర్ లో ఓ అద్బుతంగా ఉండిపోవాలని దిల్ రాజు తాపత్రయం.

  ఆడియో తేదీని తెలుపుతూ విడుదల చేసిన ఈ పోస్టర్ ఇప్పటికే అభిమానుల డెస్క్ టాప్ లను అలంకరించి ఆనందం కలుగచేస్తోంది.

  "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కచ్చితంగా నా అభిమానులకు,వెంకటేష్ గారి అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. సినిమా చూసి థియోటర్ నుంచి బయిటకు వచ్చే మొహాల్లో సంతోషం కనపడుతుంది. మంచి సినిమా చూసామన్న తృప్తిని ఈ సినిమా ఇస్తుంది..నా కెరీర్లో ఏ సినిమా ఇంతలా ఇష్టపడి చేయలేదు " అంటున్నారు మహేష్ బాబు.

  పూనేలో మహేశ్, సమంతపై ఈ నెల 6 నుంచి 10 వరకూ ఓ పాట తీశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ నెల 19 నుంచి 21 వరకూ వెంకటేశ్, అంజలిపై కేరళలోని చాలకుడిలో ఓ పాట చిత్రీకరించడంతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. సంక్రాంతి సందర్భంగా జనవరిలో చిత్రాన్ని విడుదల చేస్తారు.

  English summary
  Seethamam Vakitlo Sirimalle Chettu Audio is releasing on 16t December 2012, that is today, A Special Set is constructing at Ramanaidu Studios at Nanakramguda for the Audio Release. This is the latest pic. This is the ENtry Pass for VVIP and this is a Audio Launch Invitation for the movie Seethamam Vakitlo Sirimalle Chettu, Audio is releasing at Ramanaidu Studios, Nanakramguda, Function starts from Evening 7 PM.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X