మహేష్-వెంకీ ‘సీత్మమ్మ వాకిట్లో...’ ఫ్రెష్ అప్డేట్స్
హైదరాబాద్: మహేష్, వెంకటేష్ హీరోలుగా రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి సంబంధించిన న్యూ షెడ్యూల్ నేటి(అక్టోబర్ 2) నుంచి ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్‌లో రామా నాయుడు స్టూడియోలో పలు సీన్లు చిత్రీకరించనున్నారు.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. త్వరలో టాకీపార్ట్ పూర్తికానుంది. పాటల చిత్రీకరణ మిగిలివుంది.
ఈ చిత్రం గురించి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ...అన్న మాట ఆ తమ్ముడికి వేదవాక్కు. తమ్ముడంటే అన్నయ్యకు పంచ ప్రాణాలు. మమతానురాగాలు వెల్లివిరిసే ఉమ్మడి కుటుంబం వారిది. ఆ ఇంట్లో అనునిత్యం ఉగాదులు, ఉషస్సులే. మట్టిపరిమళాల సుగంధాలు..పైరగాలి జాడలు..సంక్రాంతి సంబరాలతో ఓ కోవెలలా కొలువుదీరిన ఒక అందమైన పల్లెటూరి కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అని వెల్లడించారు.
ఉమ్మడి కుటుంబంలోని బాంధవ్యాలు గత స్మృతులుగానే మిగిలిపోతున్నాయి. వాటన్నింటినీ తిరిగి మనకళ్లముందుంచుతూ రూపొందిస్తున్న దృశ్యకావ్యమే మా సినిమా... అన్నదమ్ముల బంధంలోని ఔన్నత్యాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నాం' అన్నారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











