SVSC సెన్సార్ సర్టిఫికెట్ ఆపేసారు, అందుకేనా?
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్‌గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫిరెట్ జారీ అవ్వాల్సి ఉంది.
అయితే ఈ రోజు సౌతిండియా వ్యాప్తంగా సర్వీస్ టాక్స్‌కు వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టడం, షూటింగులు బంద్ లాంటి కార్యక్రమాల నేపథ్యంలో..... ఈ రోజు ఇవ్వాల్సిన సెన్సార్ సర్టిఫికెట్‌ను ఆపేసారు. రేపు ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ...శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమాకు వందకు వంద మార్కులు పడతాయి. మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకం ఉంది' అన్నారు. 25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా బేనర్ల రావడం ఎంతో ఆనందంగా ఉంది, దీన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్, మిక్కీజే మేయర్ సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్సవుతాయి. రెగ్యులర్ చిత్రాల్లా కాకుండా మన రియల్ లైఫ్‌ను పోలి ఈ చిత్రం ఉంటుందని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో పూర్తి కుటుంబ కథా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి వెన్నెల సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











