‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సెన్సార్ రిపోర్ట్
హైదరాబాద్ : అంతా అనుకున్నట్లుగానే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే సర్టిఫికెట్ పొందింది. ఈ రోజు ఈ చిత్రాన్ని సెన్సార్ చేసిన బోర్డు సభ్యులు.....క్లీన్ 'U' సర్టిఫికెట్ జారీ చేసారు. ఈ చిత్రం ఈ నెల 11న గ్రాండ్‌గా విడుదలవుతోంది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈచిత్రం మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన మల్టీ స్టారర్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈచిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అన్న దమ్ముల అనుబంధం, ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో ఈచిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా గురించి ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ...'25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా బేనర్ల రావడం ఎంతో ఆనందంగా ఉంది, దీన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్, మిక్కీజే మేయర్ సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్సవుతాయి. రెగ్యులర్ చిత్రాల్లా కాకుండా మన రియల్ లైఫ్‌ను పోలి ఈ చిత్రం ఉంటుంది, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమాకు వందకు వంద మార్కులు పడతాయి. మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకం ఉంది' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.ః
మహేష్ బాబు, వెంకటేష్, సమంత, అంజలి హీరో హీరోయిన్లుగా ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, రమా ప్రభ, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం : మిక్కీజె మేయర్, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, సినిమాటోగ్రఫీ : గుహన్, ఫైట్స్: విజయ్, నిర్మాత : దిల్ రాజు, దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల.


Click it and Unblock the Notifications











