SVSC సెన్సార్ సర్టిఫికెట్ ఇదే... (ఫోటో)
హైదరాబాద్: మహేష్ బాబు-వెంకటేష్ మల్టీ స్టారర్‌గా రూపొందిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం నిన్న సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'U' సర్టిఫికెట్ పొందిన విషయాన్ని ఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చాం. తాజాగా సెన్సార్ బోర్డ్ జారీ చేసిన సర్టిఫికెట్‌ను మీ ముందుకు తెస్తున్నాం.
ఈ సర్టిఫికెట్ ను పరిశీలిస్తే.... సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి ఎలాంటి కత్తెర్లు వేయలేదని స్పష్టం అవుతోంది. మొత్తం ఐదుగురు సభ్యులతో కలిసి సెన్స్ బోర్డు బృందం ఈ చిత్రాన్ని వీక్షించారు. సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ ఎ.ధనలక్ష్మి, సభ్యులు అన్నా మల్లేశ్వరి యాదవ్, డివిఎన్ రాజు, జెపి హుస్సేనయ్య, వి. మంగారెడ్డిలు SVSC చిత్రాన్ని వీక్షించి ఈ సర్టిఫికెట్ జారీ చేసారు. సినిమా లెంత్ మొత్తం 159 నిమిషాలు.
ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...'మా చిత్రం ఒక్క కట్ కూడా లేకుండా క్లీన్ 'యూ' సర్టిపికెట్ పొందింది. ఈ మధ్య కాలంలో ఒక్క కట్ లేకుండా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని తీసినందుకు సెన్సార్ ఆఫీసర్ ఎంతగానో అభినందించారు. క్లైమాక్స్ లో ఏడిపించారు. చాలా హార్ట్ టచ్చింగా ఉంది అని ముగ్గురు లేడీ మెంబర్స్ అభినందించారు. ఈ సినిమా ఆరు నెలకు పైగా ఆడుతుంది. చాలా గొప్ప సినిమా తీసారని ప్రశంసించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ మల్టీ స్టారర్ ఈ సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా జనవరి 11న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాము. తప్పకుండా అందరి ఎక్స్ పెక్టేషన్స్ ని ఈ సినిమా రీచ్ అవుతుంది. మా బేనర్ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రం మా బేనర్ ప్రెస్టేజ్ మరింత పెంచుతుంది. ఈ మల్టీ స్టారర్ ఇంత బాగా రావడానికి దోహద పడిన వెంకటేష్, మహేష్ బాబులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అన్నారు.
వెంకటేష్ మాట్లాడుతూ..'చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఎక్స్ ట్రార్డినరీ పాయింట్ తో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి పర్ ఫెక్ట్ మూవీ. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. మహేష్ తో కలిసి ఇంత మంచి సినిమాలో నటించడం చాలా హ్యాపీగా ఉంది' అన్నారు.
మహేష్ బాబు మాట్లాడుతూ... 'శ్రీకాంత్ చెప్పిన సబ్జెక్ట్ విని ఎంతో ఇన్ స్పైర్ అయ్యాను. ఈ సినిమా చేయడం మంచి అనుభూతిని కలిగించింది. మూడు రోజుల ముందే సంక్రాంతి పండగ వచ్చినంత ఆనందం అభిమానుల్లో కనిపిస్తుంది. అన్ని విధాలుగా సంతృప్తిని కలిగించిన సినిమా ఇది. వెంకటేష్ గారితో ఇంత మంచి సినిమాలో నటించడం చాలా ఆనందాన్ని కలిగించింది' అన్నారు.


Click it and Unblock the Notifications











