twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SVSC రికార్డ్ర్ రిలీజ్, వందకు వంద ఖాయం : దిల్ రాజు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మహేష్ బాబు-వెంకటేష్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఈ నెల 11న విడుదల చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిర్మాత దిల్ రాజు హైదరాబాద్‌లోని ప్రసాద్స్ లాబ్స్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

    ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ...'ఈ నెల 11న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. వచ్చే వారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తవుతాయి. సినిమాను ఎంతో కష్ట పడి తీసాము. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమాకు వందకు వంద మార్కులు పడతాయి. మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకం ఉంది' అన్నారు.

    25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా బేనర్ల రావడం ఎంతో ఆనందంగా ఉంది, దీన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్, మిక్కీజే మేయర్ సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్సవుతాయి. రెగ్యులర్ చిత్రాల్లా కాకుండా మన రియల్ లైఫ్‌ను పోలి ఈ చిత్రం ఉంటుందని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

    అమావాస్య కారణంగా 10వ తేదీన ప్రీమియర్ షోలు వేస్తున్నాం. లేడీస్ కోసం ప్రత్యేకమైన షోలు వేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. త్వరలో వీటిపై నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తామని దిల్ రాజు వెల్లడించారు. మహేష్ బాబు, వెంకటేష్, సమంత, అంజలి హీరో హీరోయిన్లుగా ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, రమా ప్రభ, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం : మిక్కీజె మేయర్, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్, సినిమాటోగ్రఫీ : గుహన్, ఫైట్స్: విజయ్, నిర్మాత : దిల్ రాజు, దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల.

    English summary
    The much-awaited Telugu movie Seethamma Vakitlo Sirimalle Chettu (SVSC) starring Mahesh Babu and Venkatesh in leads, is scheduled to hit the screens across the globe on January 11. Producer Dil Raju has confirmed that the movie will release as a Sankranthi treat and it will have premiere just a day before its release. Talking to media recently, Dil Raju said that Seethamma Vakitlo Sirimalle Chettu has completed all post-production works and is set to appear before the Regional Censor Board within a couple of days. The producer added, the movie will release on January 11. But since it is 'Amavasya' (New Moon), the film unit has planned to premiere film on January 10.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X