ప్రాణం తీసిన సినిమా సరదా, SVSC చూడాలనే తపనతో..!
హైదరాబాద్: సినిమా సరదా ఓ అభిమాని ప్రాణం తీసింది.'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం చూడటానికి వచ్చిన అభిమాని కరెంటు షాక్ గురై మరణించాడు. ఈ విషాద సంఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. కిరణ్ అనే అభిమాని ఈ సంఘటనలో మృత్యువాత పడ్డాడు.
మహేష్ బాబు-వెంకటేష్ నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చూసేందుకు కిరణ్ తిరుపతిలోని థియేటర్ కు శుక్రవారం ఉదయం చేరుకున్నాడు. స్టార్ హీరోలు కావడంతో థియేటర్ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. ఎలాగైనా థియేటర్లోకి ప్రవేశించి టిక్కెట్లు దక్కించుకోవాలని ప్రయత్నించిన కిరణ్.... థియేటర్ వెనక భాగంలో ఉన్న టాన్స్ ఫార్మర్ పక్కనుండి లోనికి ప్రవేశించడానికి ట్రైచేసాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై మరణించారు. కిరణ్ మరణంతో ఒక్కసారిగా సినిమా అభిమనులంతా ఉలిక్కి పడ్డారు.
స్టార్ హీరోల సినిమా విడుదల సమయంలో అభిమానులు మృత్యువాత పడటం ఇది తొలిసారి కాదు. గతంలో పలు సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ కొందరు వీరాభిమానులు టిక్కెట్లు దక్కించుకోవడానికి ప్రమాదకర మార్గాలను ఎంచుకుంటున్నారు. తమ కుటుంబాల్లో విషాదాన్ని నింపుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











