మహేష్ లేకుండా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'
వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ డిసెంబర్ నెల 15 నుంచి విశాఖపట్నంలో జరగనుంది. అక్కడ కొన్ని సీన్స్ తో పాటు ఓ పాటను కూడా ఫస్ట్ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారు. ఇక ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు పాల్గొనరు. కేవలం వెంకటేష్ తోనే సీన్స్ చిత్రీకరిస్తారు. మహేష్ జనవరి నుంచి ఈ చిత్రం షూటింగ్ కు హాజరవుతారు. ఇక ఈ చిత్రంలో లో ప్రకాష్ రాజ్ కీలకపాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వ్రకాష్ రాజు చేసే పాత్ర తండ్రి పాత్ర అని తెలుస్తోంది.పరుగులో చేసిన పాత్రనే ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో చేయనున్నారు.
ఈ చిత్రం గురించి దిల్‌రాజు మాట్లాడుతూ ''25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీస్టారర్ ఇది. వెంకీ, మహేష్ అన్నదమ్ము లుగా నటిస్తున్నారు. సీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు..అంటే కుటుంబం. టైటిల్ మంచి ఫీల్‌నిచ్చింది. మే నెలాఖరుకి సినిమా పూర్తిచేసి..అదే నెలలో విడుదల చేస్తాం అన్నారు.
దసరా రోజు పూజ చేసి లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ లో వెంకటేష్,ప్రకాష్ రాజ్ ఇద్దరూ నవంబర్ నుంచి షూటింగ్ లో పాల్గొంటారు. మహేష్ మాత్రం జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళతారు. ఇక ఈ చిత్రంలో వెంకటేష్, మహేష్ ఇద్దరూ అన్నదమ్ములుగా కనిపించనున్నారని చెప్పుకున్నారు. ప్రస్తుతం మహేష్ దూకుడు విజయోత్సాహంలో ఉన్నారు. పూరీ తో చేస్తున్న ది బిజినెస్ మ్యాన్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.సహనిర్మాతలు: శిరీష్- లక్ష్మణ్, కథ- కథనం-మాటలు-దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.


Click it and Unblock the Notifications











