డివైడ్‌టాక్ వచ్చిందని దిల్ రాజే ఒప్పుకున్నాడు
హైదరాబాద్: సంక్రాంతి కానుకగా విడుదలైన దిల్ రాజు తాజా చిత్రం 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం స్లోగా ఉందని, బాగా క్లాస్ గా ఉందని, సెకండాఫ్ మరింత బాగా చేసి ఉంటే బాగుండేదని ఇలా రకరకాలుగా డివైడ్ టాక్ మొదటి రోజు వచ్చింది. దాన్ని దిల్ రాజు సైతం మీడియా సమావేశాల్లో ఒప్పుకోవటం చర్చనీయాంసమైంది.
దిల్ రాజు మాట్లాడుతూ.... పరుగు, కొత్త బంగారులోకం చిత్రాలకు కూడా తొలుత కాస్త డివైడ్‌టాక్ వచ్చింది. తర్వాత ఆ సినిమాలు ఎంతటి విజయాలను నమోదు చేశాయో తెలిసిందే. ఈ సినిమా కూడా అదే దారిలో పయనించి మా సంస్థలో బ్లాక్‌బాస్టర్‌గా నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలను అన్నారు. దీన్ని ఓ వర్గం సినిమాకు దిల్ రాజే డివైడ్ అని ఒప్పుకున్నాడు కదా ఇంకా టాక్ ఏంటి అని విమర్శలు చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం గురించి దిల్ రాజు... ''నిర్మాతగా నాకెంతో సంతృప్తినిచ్చిన సినిమా 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'. తొలిరోజు నుంచే కుటుంబ ప్రేక్షకుల ఆదరణ ఈ సినిమాకు లభించడం ఆనందంగా ఉంది'' అని అన్నారు. వెంకటేష్, మహేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం శుక్రవారం విడుదలైంది.
''ఈ సినిమాకు లభిస్తున్న ప్రశంసలు మరిచిపోలేనివి. ఈ క్రెడిట్ మొత్తం వెంకటేష్, మహేష్‌లదే. వారిచ్చిన సహకారం వల్లే సినిమాను దిగ్విజయంగా పూర్తి చేయగలిగాం. చాలా రోజుల తర్వాత థియేటర్ల నిండా కుటుంబ ప్రేక్షకులు కనిపిస్తున్నారు. చాలామంది సినిమా చూసి భావోద్వేగానికి గురవు తున్నారు.'' అని తెలిపారు దిల్ రాజు.


Click it and Unblock the Notifications











