SVSC... న్యూ షెడ్యూల్ డీటేల్స్
హైదరాబాద్: విక్టరీ వెంకటేష్-ప్రిన్స్ మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెట్టు'. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది.
ఈ చిత్రం న్యూ షెడ్యూల్ ఆగస్టు 19 నుంచి మొదలు కానుంది. ఈ చిత్రం దసరాకి విడుదల కావాల్సి ఉన్నప్పటికీ...సమంత అనారోగ్య కారణాలతో షూటింగుకు దూరంగా ఉండటం, కూతురు పుట్టిన సందర్భంగా మహేష్ బాబు బ్రేక్ తీసుకోవడం లాంటి కారణాలతో షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. దీన్ని డిసెంబర్లో గానీ, జనవరి 2013లోగానీ విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లు మహేష్ బాబు బర్త్ డేను పురస్కరించుకుని ఆగస్టు 9న విడుదలయ్యాయి. ఇందులో వెంకీ, మహేష్ కాంబినేషన్, గెటప్‌లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రం హిందీలో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన 'కభీ ఖుషీ కభీ ఘమ్' చిత్రానికి రీమేక్ అనే రూమర్లు వినిపించగా దిల్ రాజు ఖండించారు. ఈ మూవీకి సంగీతం: మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం: గుహన్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











