కృష్ణా జిల్లాలో మహేష్-వెంకీ మూవీ న్యూ రికార్డ్
హైదరాబాద్: మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్‌గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం డిసెంబర్ 21న విడుదలకు సిద్ధం అవుతోంది.
తాజాగా ఈ చిత్రం కృష్ణా జిల్లా రైట్స్ విషయంలో కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ చిత్రం కృష్ణా జిల్లా రైట్స్ రూ. 2.75 కోట్లు అమ్ముడుపోయాయి. తెలుగు సినిమా చరిత్రలో ఏ చిత్రానికి కూడా జిల్లాలో ఈ రేంజిలో రేటు పలక లేదు. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా కావడమే సినిమాపై ఇంత క్రేజ్ ఏర్పడటానికి కారణమని భావిస్తున్నారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ... అన్న మాట ఆ తమ్ముడికి వేదవాక్కు. తమ్ముడంటే అన్నయ్యకు పంచ ప్రాణాలు. మమతానురాగాలు వెల్లివిరిసే ఉమ్మడి కుటుంబం వారిది. ఆ ఇంట్లో అనునిత్యం ఉగాదులు, ఉషస్సులే. మట్టిపరిమళాల సుగంధాలు..పైరగాలి జాడలు.. సంక్రాంతి సంబరాలతో ఓ కోవెలలా కొలువుదీరిన ఒక అందమైన పల్లెటూరి కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అని వెల్లడించారు.
ఉమ్మడి కుటుంబంలోని బాంధవ్యాలు గత స్మృతులుగానే మిగిలిపోతున్నాయి. వాటన్నింటినీ తిరిగి మనకళ్లముందుంచుతూ రూపొందిస్తున్న దృశ్యకావ్యమే మా సినిమా... అన్నదమ్ముల బంధంలోని ఔన్నత్యాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నాం' అన్నారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











