ఈ సంక్రాంతితో పవన్ సినిమా రికార్డ్ స్మాష్!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుతో ఇప్పటికే పలు రికార్డులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ సంక్రాంతికి అందులో కొన్ని బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఫస్ట్ డే రిలీజ్ విషయంలో హైదరాబాద్‌లో అత్యధిక థియేటర్లలో రిలీజైన సినిమాగా పవన్ కళ్యాణ్ నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' ఇప్పటి వరకు టాప్‌లో ఉంది.
అయితే ఈ సంక్రాంతికి విడుదలవుతున్న..... 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'నాయక్' చిత్రాల్లో ఏదో ఒకటి పై రికార్డును స్మాష్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు చిత్రాలను నైజాం ఏరియాలో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. పైగా సంక్రాంతి ఈ రెండు పెద్ద సినిమాలకు పోటీగా కమల్ హాసన్ 'విశ్వరూపం' తప్ప మరే భారీ బడ్జెట్ సినిమాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో దిల్ రాజు తన నెట్వర్క్ ఉపయోగించి తొలిరోజు భారీగా ఓపెనింగ్స్ రాబట్టేందుకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లను దక్కించుకునేలా మేనేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
నాయక్ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత డివివి దానయ్య యూనివర్సల్ మీడియా బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి పడగను పురస్కరించుకుని జనవరి 9న 'నాయక్' చిత్రం గ్రాండ్‌గా విడుదలవుతోంది. అయితనే 'నాయక్' టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గిరిజన విద్యార్థి ఆందోళనకు సిద్ధం అవుతున్న తరుణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ సైతం నిర్మాతలు, అభిమానుల్లో నెలకొంది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం విషయానికొస్తే.... శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో పూర్తి కుటుంబ కథా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి వెన్నెల సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











