మహేష్ సినిమాపై పుకారు- దిల్ రాజు ఖండన
సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ స్టార్ వెంకటేష్ మల్టీ స్టారర్లుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రంపై గత కొన్ని రోజులుగా ఓ పుకారు రాజ్యమేలుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రం హిందీలో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన 'కభీ ఖుషీ కభీ ఘమ్' చిత్రానికి రీమేక్ అనే రూమర్లు వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు హృతిక్ కోషన్ పాత్రలో కనిపించనున్నారని, వెంకటేష్, ప్రకాష్ రాజ్ పాత్రలు షారుఖ్ ఖాన్, అమితాబ్ వచ్చన్ పాత్రలను పోలి ఉంటుందని, 'కభీ ఖుషీ కభీ ఘమ్' చిత్రం ఆధారంగానే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కథ తయారు చేసుకున్నాడని ఆ రూమర్ల సారాంశం.
ఈ వార్తలపై ఓ ప్రముఖ ఇంగ్లీష్ డైలీ ఇంటర్వ్యూలో దిల్ రాజు స్పందిస్తూ....ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఏ చిత్రానికి రీమేక్ కాదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా ఇది వరకు రాని స్టోరీ అని వెల్లడించారు. ఈచిత్రంలోని పాత్రలు కూడా ఎవరి నుంచి ఇన్‌స్పైర్ అయి క్రియేట్ చేసినవి కావని స్పష్టం చేశారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో మహేష్ బాబు సరసన సమంత నటిస్తుండగా, వెంకీ సరసన జర్నీ ఫేం అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రు. సంగీతం: మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం: గుహన్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.


Click it and Unblock the Notifications











