SVSC లిమిటెడ్ ప్రీమియర్ షో, టికెట్ ధర రూ. 5000
హైదరాబాద్: మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం రేపు(జనవరి 11)న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రేపు అమావాస్య కారణంగా ఈ రోజు రాత్రే భారీగా ప్రీమియర్ షోలు నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటికీ.... ఎందుకనో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
అయితే హైదరాబాద్‍లో మాత్రం ప్రముఖుల కోసం ఈ రోజు(జనవరి 10) రాత్రి స్పెషల్, లిమిటెడ్ మెంబర్స్‌తో ప్రీమియర్ షో ఏర్పాటు చేసారు. ఈ షోకు ఒక్కో టికెట్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 5000. మరీ ఇంత రేటు ఎందుకని అడిగితే, ఆ మొత్తాన్ని నిర్మాత దిల్ రాజు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి విరాళంగా ఇస్తారట. అందుకోసమనే ఇంత భారీ మొత్తం ఒక్కో టికెట్‌పై వసూలు చేస్తున్నారని అంటున్నారు.
కాగా... 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ 'U' సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇదో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని, చాలా కాలం తర్వాత తమకు పెద్దగా పని లేకుండా గొప్ప సినిమా తీసారని సెన్సార్ బోర్డు సభ్యులు మెచ్చుకున్నారని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు.
ఈ చిత్రం గురించి ఆయన మరిన్ని వివరాలు వెల్లడిస్తూ...దాదాపు 25 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ మల్టీ స్టారర్ ఈ సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా జనవరి 11న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాము. తప్పకుండా అందరి ఎక్స్ పెక్టేషన్స్ ని ఈ సినిమా రీచ్ అవుతుంది. మా బేనర్ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రం మా బేనర్ ప్రెస్టేజ్ మరింత పెంచుతుంది. ఈ మల్టీ స్టారర్ ఇంత బాగా రావడానికి దోహద పడిన వెంకటేష్, మహేష్ బాబులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అన్నారు.
మహేష్ బాబు, వెంకటేష్, సమంత, అంజలి హీరో హీరోయిన్లుగా ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, రమా ప్రభ, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మిక్కీజె మేయర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, సినిమాటోగ్రఫీ: గుహన్, ఫైట్స్: విజయ్, నిర్మాత: దిల్ రాజు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.


Click it and Unblock the Notifications











