'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అహోబిలం
మహేష్ బాబు, వెంకటేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" ఈ ఏడాది అత్యంత వేచి చూస్తున్న చిత్రం. చాలా రోజుల తరువాత ఇద్దరు ప్రధాన తారలు ఒక చిత్రం కోసం కలిసి పని చేస్తున్నారు ఈ చిత్రం మొదలయ్యాక పరిశ్రమలో కొన్ని మల్టీ స్టారర్ లు మొదలయ్యాయి.
ఈ రోజు నుంచి ఈచిత్రం షూటింగ్ అహోబిలం అడవుల్లో మొదలైంది. వెంకటేష్-అంజలిలపై ఇక్కడ పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరో నాలుగు రోజుల పాటు ఇక్కడే చిత్రీకరణ జరుగుతుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం స్టోరీ లైన్ పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. ఒక రకంగా చెప్పాలంటే రామాయణంలో రాముడు, లక్ష్మణుల పాత్రల్లా ఉంటాయి వెంకటేష్ మహేష్ బాబు పాత్రలు.
ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ.,,.ఇంటిల్లిపాదీ మళ్లీ కలుసుకోవాలంటే పండగో, పెళ్లిపిలుపో రావాల్సిందే. అప్పుడు కూడా సెలవులు దొరికితేనే! అందుకే బాబాయ్, పిన్ని, వదిన, మేనత్త... ఇలాంటి పిలుపులకు దూరమైపోతున్నాం. ఆరు బయట వెన్నెల్లో కబుర్లు చెప్పుకొనే రోజులు మర్చిపోతున్నాం. మళ్లీ అలాంటి వాతావరణం మా సినిమాలో చూడొచ్చు అన్నారు. వెంకటేష్, మహేష్‌బాబుల వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకొంటాయని తెలిపారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, సమంత , అంజలి లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిక్కి జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం ఈ దసరాకి విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











