twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సీతమ్మ వాకిట్లో...’ లేటెస్ట్ ఇన్ఫో...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: విక్టరీ వెంకటేష్-ప్రిన్స్ మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది.

    తాజాగా ఈచిత్రం షూటింగ్ చెన్నయ్ సమీపంలోని శ్రీపెరుంబుదూర్ ప్రాంతంలో జరుగుతోంది. ఇక్కడ కీలకమైన పెళ్లి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మహేష్ బాబుతో పాటు, వెంకటేష్, సమంత ఇతర నటీనటులు షూటంగులో పాల్గొంటున్నారు. అన్నదమ్ముల అనుబంధం, ఉమ్మడి కుటుంబం, కుటుంబ కలహాలు నేపథ్యంలో ఈచిత్రం రూపొందుతోంది.

    ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లు మహేష్ బాబు బర్త్ డేను పురస్కరించుకుని గత నెల విడుదలయ్యాయి. ఇందులో వెంకీ, మహేష్ కాంబినేషన్, గెటప్‌లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. డిసెంబర్ నెలలో ఈచిత్రం ప్రేక్షకుత ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, రోహిణి హట్టంగడి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: కె.వి.గుహన్, కళ: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.

    English summary
    Superstar Mahesh Babu is currently shooting in Sriperumbudur near Chennai for the multistarrer film ‘Seethamma Vakitlo Sirimalle Chettu’. Shooting has started from yesterday and some key marriage scenes are reportedly being shot currently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X