మహేష్-వెంకీ ‘SVSC’... సౌతిండియా రికార్డ్
హైదరాబాద్: మహేష్ బాబు, వెంకటేష్ కాంబినేషన్లో మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఇప్పటి వరకు సౌతిండియాలో ఏ చిత్రం సాధించని ఘనత సాధించి రికార్డ్ నెలకొల్పింది. ఈ చిత్రం న్యూయార్క్ సిటీ మాన్‌హట్టన్‌లోని TIMES SQUARE AMC Empires 25 థియేటర్లో విదలవుతోంది.
ఈ థియేటర్ ప్రత్యేకత ఏమిటంటే... నార్త్ అమెరికాలోనే ఎక్కువ కలెక్షన్లు సాధించే సినిమా. ప్రముఖ హాలీవుడ్ సినిమాల ప్రీమియర్ షోలు, రిలీజ్‌లు ఈ థియేటర్లోనే జరుగుతాయి. ఇందులో అనేక స్క్రీన్స్ ఉంటాయి. సౌతిండియా నుంచి తొలిసారిగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ఇక్కడ ప్రదర్శితం అవుతోంది. జనవరి 10న ఈ థియేటర్లో ప్రీమియర్ షో నిర్వహించడంతో పాటు జనవరి 11న సినిమాను ఈ థియేటర్లో విడుదల చేస్తున్నారు.
సినిమా విశేషాల్లోకి వెళితే...
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఈచిత్రం ఆడియోకి శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ఆడియోకు ఔట్ స్టాండింగ్ రెస్పాన్స్ వస్తోంది. బెస్ట్ మ్యూజిక్ అందించినందుకు మిక్కీజే మేయర్‌కు థాంక్స్. నా అభిప్రాయం ప్రకారం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆల్బం ఎంతో గొప్పది' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేసారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











