మహేష్ ఎఫెక్ట్: లేడీస్ కోసం దిల్ రాజు!
హైదరాబాద్: మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. యువ అభిమానులే కాదు... ఆయన్ను అభిమానించే వారిలో మహిళా అభిమానులు సంఖ్య కూడా ఎక్కువే. మరో హీరో విక్టరీ వెంకటేష్‌కు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్న పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంపై ఫ్యామిలీ ప్రేక్షకుల్లో, ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా షో వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఇందులో మహిళా ప్రేక్షకులకు తప్ప.... ఇతర ప్రేక్షకులకు అవకాశం లేదన్నమాట. త్వరలో ఈ షో ఎప్పుడు? ఎక్కడ? అనే వివరాలు ఖరారు కానున్నాయి.
జనవరి 11న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విడుదల కాబోతోంది. మరో వారం రోజుల్లో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు కావడం, సంక్రాంతి హాలీడేస్ సీజన్ కావడంతో ఓపెనింగ్స్ భారీగా వస్తాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ సంఖ్యలో థియేటర్లను కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో పూర్తి కుటుంబ కథా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేసింది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి వెన్నెల సీతారామశాస్త్రి.


Click it and Unblock the Notifications











