SVSC ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ డిటేల్స్
హైదరాబాద్ : సంక్రాంతి కానుకగా విడుదలై ఫ్యామిలీ ప్రేక్షకుల మదిని దోచిన సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం ఆడియోతో పాటు, సినిమా కూడా విజయవంతం అవ్వడంతో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు.
ఈ నెల 20న సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ఈ సినిమా స్టార్స్ మహేష్ బాబు, వెంకటేష్, సమంత, అంజలితో పాటు ఇతర ముఖ్య నటులు హాజరవుతారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు గ్రాండ్ గా చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పలు వినోద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. చిత్రంలోని పాటలపై పలు డాన్స్ ట్రూప్స్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటు.....టాలీవుడ్ కమెడియన్లచే నవ్వించే కార్యక్రమాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వేడుకలో ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువగా హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా....నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై భారీ బడ్జెట్‌తో ఈచిత్రాన్ని నిర్మించారు. చాలా కాలం తర్వాత తెలుగు తెరపై భారీ తారాగణంతో కూడిన మల్టీ స్టారర్ సినిమా రావడం, ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి సినిమా కావడంతో ఆదరణ పెరుగుతోంది.


Click it and Unblock the Notifications











