For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘సీతమ్మవాకిట్లో...’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ విశేషాలు (ఫోటోలతో..)

  By Srikanya
  |

  హైదరాబాద్: మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'సీతమ్మవాకిట్లో...' ఆడియో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ పంక్ష న్ జరిగింది.

  ఈ వేడుకకు వెంకటేష్ తండ్రి డి.రామానాయుడు, మహేష్ తండ్రి కృష్ణ అతిథులుగా విచ్చేశారు. అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ పాటల పండుగలో ముఖ్య అతిథుల్లో ఒకరైన కృష్ణ మాట్లాడుతూ- ఈ సినిమా చూస్తుంటే నాడు చక్రపాణిగారు, ఎల్వీ ప్రసాద్‌గారు తీసిన సినిమాలు గుర్తొచ్చాయి అన్నారు.

  "హీరోలను డెరైక్ట్ చేస్తున్నట్లు కాకుండ, నిజమైన అన్నదమ్ములనే డెరైక్ట్ చేస్తున్నట్లు భావించి ఈ సినిమా చేశాను. ఈ కథతో ముందుకెళ్ళడానికి వెంకటేష్, మహేష్, దిల్‌ రాజు అందించిన సహకారం మరిచిపోలేనిది" అని శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. ఆ విశేషాలతో కూడిన ఫోటోలు..

  హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి 'సీతమ్మ వాకిట్లో...' ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెంకటేష్‌, మహేష్‌ బాబు కథానాయకులుగా నటించిన చిత్రమిది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. దిల్‌ రాజు నిర్మాత.

  సమంత ఈ పంక్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

  'ఎందుకో నాకు మాటలు రావడం లేదు. వేదికపై సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీకాంత్‌ అడ్డాల.. మాట్లాడుతుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ సినిమాలో చెప్పినట్టు నా 'మనసుకి చాలా బాధేసింది'. ఈ విజయం వెంకటేష్‌దీ, నాదీ అంటున్నారు. కానీ ప్రేక్షకుల విజయం ఇది. శ్రీకాంత్‌ ఈ కథతో నాలుగేళ్లు ప్రయాణించాడు. ఇలాంటి గొప్ప సినిమా తీయాలనే కోరికకు రాజు ప్రాణం పోశారు. మిక్కీ జె.మేయర్‌ పాటలు కథను నడిపించాయ''ని మహేష్‌ బాబు చెప్పారు.

  పంక్షన్ అంత హంగామాగా జరుగుతున్నా... మహేష్ పైనే అందరి దృష్ఠీ.

  సమంత మాట్లాడుతూ ''ప్రతి సినిమాని నీ మొదటి సినిమాగానే స్వీకరించమని మహేష్‌బాబు సలహా ఇచ్చారు. ఆ మాట ఎప్పటికీ మరచిపోన''ని చెప్పింది.

  ''అందమైన తెలుగు కథని చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు. తెరపై పెద్దోడు, చిన్నోడు అనే పాత్రలే కనిపించాయి. పెద్దోడు వెంకటేష్‌ గురించి నాకు అనుమానం లేదు. తనేంటో నిరూపించుకొన్న నటుడు. చిన్నోడిపైనే అనుమానం. తన పాత్ర ఎలా ఉంటుందో అనుకొన్నా. కానీ పోకిరి లాంటి పాత్రలే కాదు.. తెలుగబ్బాయిగానూ కనిపించగలను అని నిరూపించాడు''అని గీతరచయిత సీతారామశాస్త్రి చెప్పారు.

  వెంకటేష్‌ మాట్లాడుతూ ''నిజ జీవితంలో నేను పెద్దగా మాట్లాడను. ఈ సినిమాలో అలాంటి పాత్రే ఇచ్చాడు దర్శకుడు. నేనో అన్నకు తమ్ముడిని. అయితే ఈ సినిమాతో నేను కూడా అన్నయ్య అయ్యాను. మహేష్‌తో కలసి నటించడం ఓ మంచి అనుభవం'' అన్నారు.

  మిక్కీ మాట్లాడుతూ ''ఈ సినిమా విజయం ఆస్కార్‌ గెలిచినంత ఆనందాన్ని ఇచ్చింది. 'నీకు తెలుగు సరిగ్గా రాదు. ఇక్కడొద్దు. బాలీవుడ్‌ వెళ్లిపో' అని మా నాన్నగారు అనేవారు. కానీ కష్టపడి తెలుగు నేర్చుకొన్నా. ఈ పాటలకు, సినిమాకీ వచ్చిన స్పందన ఎప్పటికీ మర్చిపోను''అన్నారు.

  ''పాటలొచ్చినప్పటి నుంచీ ఈ సినిమా ఎలా ఉంటుందో అని అనుక్షణం మధనపడేవాడిని. మా ప్రయత్నం అందరి మనసులనూ అలరించడం ఆనందాన్నిచ్చింది. ఇద్దరు అగ్ర కథానాయకులతో సినిమా తీసినట్టు లేదు. చిన్నోడు, పెద్దోడులతో కలిసి ప్రయాణించినట్లుంద''న్నారు దర్శకుడు.

  ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, అంజలి, విజయనిర్మల, రావు రమేష్‌, అనంతశ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

  'ఇది కథానాయకుడి చుట్టూ అల్లుకొన్న కథ కాదు. కుటుంబ బంధాల మధ్యన పుట్టిన కథ. వెండి తెరపై పల్లెటూరి వాతావరణం చక్కగా ప్రతిబింబించింది. నిజాయతీతో కూడిన ప్రయత్నం చేశారు. అందుకే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా ప్రేక్షకులకు నచ్చింద''న్నారు ప్రముఖ నటుడు కృష్ణ.

  నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమాలోలానే నాకూ, శ్రీకాంత్‌కీ మనస్పర్థలొచ్చాయి. కానీ సర్దుబాటు చేసుకొన్నాం. మా సంస్థ స్థాపించి పదేళ్లయ్యింది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాకు ఓ బహుమతిగా ఇచ్చాడు'' అన్నారు.

  English summary
  Mahesh Babu and Venkatesh's Seetamma Vakitlo Sirimalle Chettu movie triple platinum disc function held at Shilpakala Vedika, Hyderabad. SVSC directed by Srikanth Addala and produced by Dil Raju under Sri venkateswara creations banner. Music composed by Mickey J Meyer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X