‘SVSC’ టాక్ ఏంటి?

By Bojja Kumar

హైదరాబాద్: మహేష్ బాబు-వెంకటేష్ మల్టీ స్టారర్ గా రూపొందిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవ్వగా.... ఉదయాన్నే స్పెషల్ షోలు, కొన్ని చోట్లు ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలకు కారణమైన ఈ చిత్రం టాక్ ఎలా ఉందనే దానిపై ఓ లుక్కేద్దాం.

25 ఏళ్ల తర్వాత వస్తున్న పూర్తి స్థాయి, భారీ తారాగణంతో కూడిన మల్టీ స్టారర్ మూవీ కావడంతో.... సినిమా ఓ రేంజిలో హిట్ అవుతుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయిందనే టాక్ వినిపిస్తోంది.

పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ కాబట్టి... ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులుగానీ, ఇటు వెంకటేష్ అభిమానులు కోరుకునే కమర్షియల్ అంశాలకు చోటు లేకుండా పోయింది. దీనిపై ఇరు వర్గాల అభిమానుల్లో నిరాశ వ్యక్తం అవుతోంది. అయితే కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలు కూడా పూర్తి స్థాయిలో లేవనే విమర్శ సైతం వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమా స్క్రీన్ ప్లే అసలు బాగోలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కమర్షియల్ అంశాల ఆలోచన లేకుండా ఫ్యామిలీ డ్రామా కోసం వెళితే ఫర్వా లేదు కానీ, భారీ అంచనాలతో వెళితే నిరాశ తప్పదనే ఒపీనియన్ వ్యక్తం అవుతోంది.

Seethamma Vakitlo Sirimalle Chettu

కథ విషయానికొస్తే... రామలక్ష్మణుల్లాంటి అన్నదమ్మలు పెద్దోడు(వెంకటేష్), చిన్నోడు(మహేష్ బాబు). వారి తల్లిదండ్రులు ప్రకాష్ రాజ్, జయసుధ. రేలంగి గ్రామ వాస్తవ్యుడైన ప్రకాష్ రాజ్ మంచి మనిషి, ఎవరిని నొప్పించని పరోపకారి. పెద్దోడు తనకు నచ్చినట్లుగా ఉండే రకం, ఎవరెన్ని చెప్పినా తగ్గే రకం కాదు. చిన్నోడు పరిస్థితులకు అనుగుణంగా మేనేజ్ చేసే రకం. ఇద్దరు చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతుంటారు. ప్రకాష్ రాజ్ మేనకోడలు అయిన సీత(అంజలి) తల్లిదండ్రులు చనిపోవడంతో వారి ఇంట్లోనే పెరుగుతుంది. ఆమెను పెద్దోడికి ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన ఉంటుంది అందరికీ. చిన్నోడు గీత(సమంత) లవ్ లో పడతాడు. కోటీశ్వరుడైన రావురమేష్ కూతురే ఈ గీత.

రావు రమేష్ కి ప్రకాష్ రాజ్ కుటుంబం తీరు నచ్చదు. వారు ఈ ట్రెండుకు తగిన విధంగా లేరనే భావన ఆయనది. పెద్దోడు, చిన్నోడు నిరుద్యోగులుగా ఉండటం కూడా ఆయనకి నచ్చని అంశం. ఈ కారణంతో ప్రకాష్ రాజ్ ఫ్యామిలీతో బంధుత్వానికి ఇష్టపడడు. ఆ సంగతి పక్కన పెడితో చెల్లి పెల్లిలో చిన్నోడు, పెద్దోడు మధ్య మనస్ఫర్థలు మొదలవుతాయి. మరి వీరి కుటుంబంలో కలతలు ఎలా సమసి పోయాయి? రావు రమేష్ తన అభిప్రాయాన్ని మార్చుకుని వారి పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడు అనేది తర్వాతి కథ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X