ఆ సినిమా ఆపాలంటూ నిత్యానంద పిటీషన్
తమిళ నటి రంజితతో కామ కలాపాల్లో మునిగి తేలాడని, సెక్స్ స్వామి అని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందపై భాగోతాన్ని బేస్ చేసుకుని పలువురు దర్శక నిర్మాతలు సినిమాలు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమాలను అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నారు ఈ స్వామీజీ.
'స్వామి సత్యానంద' పేరుతో రూపొందుతున్న చిత్రం విడుదల ఆపి వేయాలంటూ నిత్యానంద హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ చిత్రం తనను కించ పరిచేలా రూపొందించారని నిత్యానంద ఆరోపిస్తున్నారు. తన ప్రతిష్టను దెబ్బ తీసేలా ఈ చిత్రం ఉందని, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని నిత్యానంద తన పిటీషన్లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ రేపు(ఆగస్టు 8)న విచారణకు రానుంది.
'స్వామి సత్యానంద' చిత్రంలో అలీ ముఖ్య పాత్రను పోషిస్తుండగా దర్శకుడు మదన్ పటేల్‌తో పాటు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జీవా, గుండు హనుమంత రావు, గౌతం రాజు, చిత్రం శ్రీను, బొంబాయి నటి నేహ, ఇటలీ అందాల భామ అలోకి, జయలలిత, కవిత, శ్రద్ధ, విజయ వర్మ, జెమిని ఫణి, జెన్నీ, తిలక్ తదితరులు నటిస్తున్నారు. మాటలు-సాయి కృష్ణ; పాటలు-జి.వి.హెచ్.ప్రసాద్, భారతి బాబు;
ఫోటోగ్రఫి-సుభాష్; ఎడిటింగ్-రాంబాబు; ఆర్ట్- నారాయణ; స్టిల్స్ - రంగా; కొరేయోగ్రఫి-మురళి, మదన్, హరిణి; ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్-నాగి రెడ్డి; నిర్మాతలు-జి.వి.హెచ్.ప్రసాద్, శ్రీమతి లక్ష్మి; సంగీతం, దర్శకత్వం-మదన్ పటేల్.


Click it and Unblock the Notifications











