జనవరిలో ప్రేక్షకుల ముందుకు ‘స్వామి రారా...’
ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని డాగ్ హౌస్ లో జరుగుతున్న నేపథ్యంలో చిత్ర విశేషాలను తెలియజేసేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ... 'నేను ఈచిత్రంలో జేబుదొంగగా నటిస్తున్నాను. క్రై అండ్ కామెడీ నేపథ్యంలో సినిమా సాగుతుంది. వేగంగా షూటింగ్ సాగుతోంది, జనవరిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ట్రై చేస్తున్నాం'అని వెల్లడించాడు.
ఈచిత్రంలో మరో ముఖ్య పాత్రను పోషిస్తున్న దర్శకుడు, నటుడు రవిబాబు మాట్లాడుతూ.... సుధీర్ చాలా క్లారిటీగల దర్శకుడని, నా పాత్ర గురించి కార్టూన్ వీడియో రూపంలో చూపించి నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో స్పష్టంగా వివరించాడు. ఇంత క్లారిటీ ఉన్న దర్శకుడిని నేను ఎప్పుడూ చూడలేదు అన్నారు.
సహ నిర్మాత సందీప్ మాట్లాడుతూ.... సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని, పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి జనవరిలో సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నారు. చాలా కాలంగా సరై హిట్ లేని నిఖిల్, స్వాతిలు ఈచిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. పూజ, రవిబాబు, ప్రవీణ్, జీవా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సన్ని, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, పాటలు: కృష్ణచైతన్య, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాత: చక్రి చిగురుపాటి, రచన, దర్శకత్వం: సుధీర్‌వర్మ.


Click it and Unblock the Notifications












