నిఖిల్, స్వాతి ‘స్వామి రారా’ తాజా డీటేల్స్
హైదరాబాద్: నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై సుధీర్‌వర్మ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం'స్వామి రారా..'. చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తి అయింది. రెండో షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
లవ్ విత్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందిస్తున్నారు. తాజాగా ప్రారంభమైన రెండో షెడ్యూల్ సెప్టెంబర్ 7వరకు జరపనున్నామని, కేరళ, కర్ణాటక, తమిళనాడులలో పాటల చిత్రీకరణ ఉంటుందని నిర్మాత చక్రి తిలిపారు.
సహనిర్మాత సందీప్ కొరిటాల మాట్లాడుతూ 'నిఖిల్‌తో 'వీడుతేడా' చిత్రాన్ని నిర్మించిన మేము అతనితో మరో చిత్రం చేయడం ఆనందంగా వుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే చిత్రమిది' అన్నారు.
చాలా కాలంగా సరై హిట్ లేని నిఖిల్, స్వాతిలు ఈచిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. పూజ, రవిబాబు, ప్రవీణ్, జీవా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సన్ని, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, పాటలు: కృష్ణచైతన్య, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాత: చక్రి చిగురుపాటి, రచన, దర్శకత్వం: సుధీర్‌వర్మ.


Click it and Unblock the Notifications











