For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిఖిల్, కలర్స్ స్వాతి 'స్వామి రారా' విడుదల తేదీ

    By Pratap
    |

    హైదరాబాద్: నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా నటించిన 'స్వామి రారా' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. లక్ష్మీనర్సింహా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతకాంపై ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. ఈ సినిమాకు దర్శకుడు సుధీర్ వర్మ. చక్రి చిగురుపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రం నిర్మాణం పూర్తయింది.

    లవ్ విత్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన స్వామి రారా పక్కా కమర్షియల్ చిత్రమని నిర్మాత చక్రి చిగురుపాటి అన్నారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీలయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.

    ఓ వినాయకుడి చుట్టూ తిరిగే కథ స్వామి రారా చిత్రమని, ఈ నెలలో పాటలను విడుదల చేసి ఫిబ్రవరి 14వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తామని చక్రి చిగురుపాటి చెప్పారు. నిఖిల్‌తో వీడు తేడా చిత్రాన్ని నిర్మించిన తాము అతనితో మరో చిత్రం చేయడం ఆనందంగా ఉందని సహ నిర్మాత సందీప్ కొరటాల అన్నారు. అన్ని వర్గాల ప్రజనలను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    రవిబాబు, ప్రవీణ్, జీవా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సన్ని సంగీతాన్ని సమకూర్చారు. కెమెరా రిచర్జ్ ప్రసాద్. కృష్ణచైతన్య పాటలు రాశారు. ఆర్ట్ నాగేంద్ర. ఎడిటింగ్ ఎస్ఆర్ శేఖర్. సమర్పణ శంకర్ చిగురుపాటి, రచన, దర్శకత్వం సుధీర్ వర్మ.

    English summary
    Nikhil and Colors Swathi starred Swamy Ra Ra film all set to release on February 14.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X