ఇదో సేఫ్ గేమ్: మొదటి సినిమానే సీక్వెల్

By Srikanya

హైదరాబాద్: తొలి చిత్రం ఏ దర్శకుడుకి అయినా పెద్ద పరీక్షే. అన్నాళ్లూ సినీ పరిశ్రమలో తను నేర్చుకున్నది ఏమన్నది ఆ చిత్రంతో తేలిపోతుంది. ఇవన్నీ ఆలోచించేనేమో ...సీక్వెల్ తో తన లాంచింగ్ కి రెడీ అవుతున్నాడు ఓ కొత్త దర్శకుడు. నిఖిల్, స్వాతి జంటగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన స్వామిరారా సీక్వెల్ ని సిద్దం చేసుకుని, రంగం లోకి దూకుతున్నాడు ఎన్.బోస్ అనే నూతన దర్శకుడు.

ఎన్.బోస్... స్వామి రారా దర్శకుడు వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవంతో ఈ చిత్రం రూపొందించటానికి సిద్దపడుతున్నారు. స్వామి స్వామి రారా అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ది సాగా కంటిన్యూస్ అనేది ఉపశీర్షిక. ఎన్.బోస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని స్వామిరారా చిత్రాన్ని నిర్మించిన చక్రి చిగురుపాటి లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించబోతున్నాడు.

'Swamy Raa Raa' gets a sequel now

నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ... నవ్యతతో కూడిన కథాంశంతో సినిమాలు రూపొందిస్తే ఆ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ తప్పక వుంటుందని స్వామిరారా చిత్రం మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మించబోతున్నాం. ఓ స్టార్ హీరో నటించనున్న ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా, హై బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కించనున్నాం. త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్ళనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత బీఎస్ వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X