»   » లీకైన న్యూడ్ సీన్లు, సెన్సార్ పైనే అనుమానం.., కన్నీరు పెట్టిన దర్శకుడు (వీడియో )

లీకైన న్యూడ్ సీన్లు, సెన్సార్ పైనే అనుమానం.., కన్నీరు పెట్టిన దర్శకుడు (వీడియో )

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లో మరో హాట్ స్పైసి సినిమా విడుదలకు సిద్దమవుతోంది. డర్టీ పిక్చర్ తరహ నిజజీవిత అంశాలతో రూపొందుతున్న చిత్రం 'అనార్కలీ ఆఫ్ ఆరా'. బాలీవుడ్ హాట్ భామ స్వర భాస్కర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. స్పైసి సీన్లతోనే కాకుండా హాట్ హాట్ డైలాగ్స్ తో కూడా ఈ సినిమాను రూపొందించారు.

అయితే అన్ని సినిమాల్లాగే ఇప్పుడు ఈ సినిమాకీ లేకేజ్ బెడద తప్పటం లేదు. ఉడ్తా పంజాబ్ లాంటివ్యవహారమే ఇక్కడా జరిగిందన్న వాదనా వినిపిస్తోంది. . "రాంజనా, ప్రేమ్ రతన్ ధన్ పాయో" వంటి చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించినప్పటికీ.. ఆమెలోని నటిని గుర్తించినవారు చాలా తక్కువమంది. అయితే.. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ఈ అనార్ఖలీ ఆఫ్ ఆరా.

ఈ మార్చి 24న విడుదల కావాల్సిన ఈ సినిమాలో హీరోయిన్‌ స్వరభాస్కర్‌ నటించిన కొన్ని న్యూడ్‌ సీన్స్‌ బయటకు వచ్చేశాయి. ఆ సీన్లలో కొన్నింటిని ఇటీవల సెన్సార్‌ కత్తిరించిందని టాక్‌ వినిపిస్తోంది. ఆ కత్తిరించిన సీన్స్‌ను ఇలా ఇంటర్నెట్‌కు ఎక్కించేశారని అంటున్నారు బాలీవుడ్‌ ప్రముఖులు. ఇలా కీలకమైన సీన్లు బయటకు వచ్చేయడంతో చిత్ర దర్శకుడు అవినాష్‌ కంటతడి పెట్టాడు.

ఈ లీకేజీ వెనుక సెన్సార్‌ హ్యాండ్‌ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదనలని నిరూపించే ఆధారాలు కూడా ఏమీలేకపోవటం తో ఏమీచేయలేక తలపట్టుకుంటున్నాడు దర్శకుడు. గతం లోనూ బాలీవుడ్ సంచలమైన ఉడ్తా పంజాబ్ సినిమా విషయంలో కూడా రిలీజ్ కి ముందే మొత్తం సినిమా మొత్తం లీక్ అయిపోయింది. అప్పుడు కూడా సెన్సార్ బోర్డ్ మీదనే అత్యధికుల అనుమానమూ ఉండింది.

ఈ అనుమానాలకు బలం చేకూరేందుకు కొన్ని ఘటనలూ ఆధారం గా కనిపిస్తున్నాయి. ఉడ్తాపంజాబ్ తర్వాత మళ్ళీ అంతటి దుమారం రేపిన సినిమా రాధికా ఆప్టే నటించిన పార్చేడ్. ఈ సినిమాకూడా సెంట్రల్ సెన్సార్ బోర్డ్ దగ్గర సమస్యలు ఎదుర్కున్నదే. అదే సమయం లో ఈ సినిమా నుంచి ఏ సీన్లైతే మరింత న్యూడ్ గా ఉన్నాయో ఆ సీన్లన్నీ ఆన్లైన్ లో ప్రత్యక్షమయ్యాయి,

ఇక దానితర్వాత మొన్నటికి మొన్న వచ్చిన "లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా" అనే వివాదాస్పద చిత్రం విషయంలోనూ అదే సీన్ రిపీటయ్యింది. ఇలా ఏ సినిమాలనైతే సెన్సార్ బోర్డ్ అడ్డుకుంటోందో ఆ సినిమాలలో సీన్లే ఇలా లీకేజీ భారిన పడుతున్నాయి.అందులోనూ ఉడ్తా పంజాబ్ తప్ప మిగతావన్నీ తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమాలే..

English summary
A scene from Swara Bhaskar’s Anarkali of Arrah got leaked online and it has been trending ever since. It is no surprise that deleted scenes from a film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu