»   » మినీ స్కర్ట్ లోవచ్చి తను ఇబ్బంది పడి ఇతరులను కూడా ఇబ్బంది...

మినీ స్కర్ట్ లోవచ్చి తను ఇబ్బంది పడి ఇతరులను కూడా ఇబ్బంది...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: అప్పలరాజు" చిత్రంలో సునీల్ సరసన కలర్స్ స్వాతి నటించింది. ఇటీవల ఈ చిత్రం ఆడియో కార్యక్రమం తాజ్ బంజారాలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్వాతి పొట్టి బట్టలు వేసుకుని వచ్చింది. దాంతో మీడియా స్వాతి ఎక్స్ పోజింగ్ ని తమ కెమెరాల్లో బంధించడానికి ఉత్సాహం కనబర్చారు. ఇదిలా ఉంటే తెలుగమ్మాయి అయ్యుండి ఈ ఓవర్ ఎక్స్ ఫోజింగ్ ఏంటీ? అంటూ కొంతమంది మీడియా పీపుల్స్ స్వాతిని విమర్శించారట. ఈ విమర్శలు స్వాతి వరకూ వెళ్ళాయి. దాంతో తన సన్నిహితుల దగ్గర ఈ విషయం చెప్పి తన గురించి మరీ ఇంత బ్యాడ్ గా మట్లాడుకోవడం నన్ను హర్ట్ చేస్తోంది అని పేర్కొందట. అమ్మడు మినీ స్కర్ట్ లు వేసుకొస్తే ఫర్వాలేదుగానీ..విమర్శిస్తే మాత్రం హర్ట్ అయ్యిందా అని మీడియా మిత్రులు మాట్లాడుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu