క్రైస్తవరాలిగా మారిన కలర్స్ స్వాతి
ఇక తమిళంలో 'సుబ్రమణ్యపురం'లో కొంటె చూపులతో తమిళ ప్రేక్షకులను వశపరుచుకున్న స్వాతి అక్కడ సైతం మంచి ఆఫర్స్ నే సంపాదిస్తోంది. గ్రామీణ యువతిగా లంగా ఓణీతో అలరించిన అమ్మడికి అయితే ఆచితూచి అడుగులు వేస్తున్నా అంటోంది. ఈ విషయమై మాట్లాడుతూ... కోలీవుడ్‌లో 'సుబ్రమణ్యపురం' తరహాకథల కోసం ఎదురుచూస్తున్నా. పూర్తిగా అలాగే కాకుండా కాస్త భిన్నంగా, కొత్తగా ఉండాలి. ఇకపై మాలీవుడ్‌లో చేయాలా? వద్దా? అన్న నిర్ణయాన్ని 'ఆమెన్' విడుదలైన తర్వాత తీసుకుంటానని చెప్పింది.
ప్రస్తుతం మాలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయి. అయితే వాటిని వదులుకున్నట్లు సమాచారం. దీనిపై స్వాతి ముచ్చటిస్తూ..ఇప్పుడు కూడా చాలామంది దర్శకులు సంప్రదిస్తున్నారు. భాష ప్రధాన అడ్డంకిగా నిలుస్తోంది. తమిళం, తెలుగులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునంటున్నా అంది. ఇక ప్రస్తుతం తెలుగులో కలర్స్ స్వాతి చేస్తున్న చిత్రం 'స్వామి రారా'. లవ్ విత్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందిస్తున్నారు.
'స్వామి రారా' చిత్రం కాన్సెప్టు గురించి దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ...''ఒక వినాయకుడి విగ్రహం చుట్టూ తిరిగే కథ ఇది. సినిమాలోని పాత్రలన్నీ వినాయకుడి విగ్రహం చుట్టూ సాగుతుంటాయి. ఓ ప్రేమ జంటకు, స్వామి విగ్రహానికి ఉన్న సంబంధం ఏమిటనేది ఆసక్తికరం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. కేరళ, తమిళనాడుల్లో పాటలు చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాము. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న సినిమా. వచ్చే నెలాఖరుకి ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తవుతుంది'' అన్నారు.


Click it and Unblock the Notifications












