స్వాతి ఆనందానికి కారణం రామ్ చరణ్ అట!
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో వెంకీని ప్రేమిస్తున్నానంటూ తెగ ఇబ్బంది పెట్టిన స్వాతికి ఈ మధ్య ఆనందానికి అవధులు లేవట. దీనికి కారణం ఎవరో తెలుసా? మగధీర రామ్ చరణ్. ప్రస్తుతం విక్రమ్ సరసన ఓ తమిళ సినిమాలో నటిస్తోన్న స్వాతి, ఎయిర్ టెల్ యాడ్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ సరసన నటించే అవకాశం కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు సరసన యాడ్ లో నటించే అవకాశం కొట్టేసినందుకు స్వాతి తెగ సంబరపడిపోతోందట. మెగాస్టార్ గారి సినిమాలో లేకపోయినా ఇప్పటి యూత్ ఐకాన్ రామ్ చరణ్ తో ఈ యాడ్ చేయడం చాలా ఆనందంగా వుందని స్వాతి చెపుతోంది.


Click it and Unblock the Notifications











