నా మొగుడు పెద్ద సైకో.. జీవితంలో పెద్ద తప్పు చేశా.. స్వాతి నాయుడు వీడియో వైరల్
స్వాతి నాయుడు ఈ పేరే ఒక సంచలనం. శృంగార తారగా స్వాతి నాయుడు మంచి డిమాండ్ ఉంది. యూట్యూబ్‌లో లెక్కలేనన్ని హాట్ వీడియోలు చేసి యూత్‌ను ఆకట్టుకుంది. శృంగార విషయాలు, మెలుకువలు చెబుతూ యూత్‌ను కట్టిపడేస్తూ ఉంటుంది. అయితే స్వాతి నాయుడు గతేడాది వివాహం చేసుకుని సంసార జీవితాన్ని కొనసాగిస్తోంది. స్వాతి నాయుడికి ఓ బిడ్డ కూడా జన్మించింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు స్వాతి నాయుడు సంసారంలో గొడవలు మొదలయ్యాయి. ఈ మేరకు స్వాతి నాయుడు విడుదల చేసిన వీడియో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

బిడ్డ జన్మించిన సమయంలో..
స్వాతి నాయుడు 2019 లో ఫిబ్రవరి 23న విజయవాడ లో పెళ్లి చేసుకుంది. స్వాతి నాయుడికి బిడ్డ పుట్టిన సందర్భంలో సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. స్వాతి నాయుడు బిడ్డపై శ్రీ రెడ్డి కామెంట్ చేయడం, మెగా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.

తాజాగా ఓ వీడియో..
తాజాగా స్వాతి నాయుడు ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో తన బాధలను వివరించింది. అందులో ఏముందంటే.. ‘మేము కొత్త ఇల్లు ఒకటి కట్టుకుంటున్నాము. మరో వైపు లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అంతే కాదు పాప ఆరోగ్యం కూడా బాలేదు. ఈ టెన్షన్‌లో మా ఆయన రోజు మందు తాగుతున్నాడు. వద్దు అంటే నా మీద కోపం అవుతున్నాడు. ఆస్తి విషయంలో కూడా మా నాన్న తో గొడవ వచ్చింది.

తప్పు చేశాను..
చిన్న పాపతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. పాపను చూడమన్నా చూడటం లేదు.. ప్రతి చిన్న విషయానికి కోప్పడుతున్నాడు.. చాలా గొడవలు అవుతున్నాయి. తనను పెళ్లి చేసుకుని నేను తప్పు చేశానని అనిపిస్తుంది.. నేను అతన్ని చేసుకోలేదు.. తనే కావాలని ఇష్టపడి నన్ను చేసుకున్నాడు. ఇప్పుడు తాగుడు మానేయమంటే నిన్ను పాపని వదిలేస్తా కానీ మందు వదలను అంటున్నాడు. పెళ్లి చేసుకుని తప్పు చేశాను అనిపిస్తుంది.

సైకోలా ప్రవర్తిస్తున్నాడు..
ప్రతి రోజు గొడవ చెయ్యటం తో నేను ఇంటి నుంచి కిందికి వెళ్లి పోలీసులకు చెప్పాను.. నా భర్త తాగేసి గొడవ చేస్తున్నాడు.. సామాన్లు పగలగొట్టేసి.. చచ్చిపోతానని బెదిరుస్తున్నాడని చెప్పాను. నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్లడంతో.. వాళ్లు కోటింగ్ ఇస్తారని చేతులు కోసుకుంటున్నాడు. సైకోలా బిహేవ్ చేస్తున్నాడు.. చేతి మీద కాళ్లపైనా చాలా చోట్ల కోసేసుకుంటున్నాడు.
Recommended Video

చాలా ఏడ్పించాడు..
పెళ్లి కాకముందు చాలా ఏడిపించాడు.. పెళ్లైన తరువాత.. కడుపుతో ఉన్నప్పుడు కూడా ఏడ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు పాపని పెట్టుకుని ఏడ్వాల్సి వస్తుంది. ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే.. త్వరలో మేం విడిపోవడం ఖాయం.. తనని నేను ఇంక భరించలేను. చాలా మంది నా లైఫ్‌లోకి వచ్చి డబ్బులు తీసుకుని ఏడిపించి వెళిపోయారు.. ఇప్పుడు ఇతను మరో స్టెప్ ముందుకువేసి.. పెళ్లి చేసుకుని పాపను కని ఏడిపిస్తున్నాడు. పాపని కూడా అతనికే వదిలేసి నేను ఒక్కదాన్నే దూరంగా వెళిపోతా' అంటూ తన వ్యథను వివరించింది. అయితే మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











