తల్లి కాబోతున్న శృంగార తార.. ఆయన చేష్టలతో వేగలేకపోతున్నా.. భర్తపై స్వాతినాయుడు
హాట్ హాట్ కామెంట్లు, బోల్డుగా వ్యాఖ్యలు చేస్తూ యూట్యూబ్‌ను యమ హీటెక్కించే శృంగార తార స్వాతినాయుడు అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే స్వాతినాయుడు త్వరలోనే తల్లి కాబోతున్నది. తాను ప్రెగ్నెంట్ అని అప్పట్లో మీడియాకు ఉప్పందించిన ఈ హాట్ స్టార్ తాజాగా మారోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా సీమంతం రోజున హాట్ కామెంట్లు చేసి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆమె ఏమన్నారంటే..

పెళ్లి తర్వాత రెండో రోజునే
పెళ్లి తర్వాత హానీమూన్‌కు వెళ్లిన స్వాతినాయుడు అక్కడే గొడవపడినట్టు బోల్డుగా చెప్పేయడం తెలిసిందే. తన భార్య గురించి అప్పట్లో మాట్లాడుతూ.. మా పెళ్లయిన తర్వాత సెకండ్ నైట్ గొడవైంది. అపుడు వాళ్ల నాన్న ఓ విషయం ఓపెన్‌గా చెప్పాడు. నువ్వు అన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నావు కదా...తను మూర్ఖురాలు, మనమే ఛేంజ్ కావాలని అన్నారు. ఆమె గురించి కొన్ని గలీజ్ మాటలు కూడా అన్నాడు, కానీ ఆ మాటలు ఇక్కడ చెప్పలేను. అందుకే నేను మారిపోయి నాకు కావాల్సింది మా అత్త మామాలను అడిగటం మొదలు పెట్టాను అని స్వాతి నాయుడు భర్త అవినాష్ తెలిపారు.

లాక్‌డౌన్‌లో ఘనంగా సీమంతం
2019లో పెళ్లి చేసుకొన్న స్వాతినాయుడు, అవినాష్ దంపతులు త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్వాతినాయుడు 8 నెలల ప్రెగ్నెంట్. రెండు రోజుల క్రితం విజయవాడలో ఆమె సీమంతం ఘనంగా నిర్వహించారు. లాక్‌డౌన్ పిరియడ్‌లో ఎలాంటి వివాదాలకు చోటువ్వకుండా సామాజిక దూరం పాటిస్తూ ఈ వేడుకను పూర్తి చేశారు.

తల్లిని కాబోతుండటం హ్యాపీగా ఉంది
సీమంతం సందర్భంగా స్వాతినాయుడు ఎప్పటిలానే సహజసిద్ధంగా వ్యాఖ్యలు చేసింది. ఎవరేమనుకొంటారో అనే విషయాన్ని పట్టించుకోకుండా భార్య, భర్తల మధ్య ఉండే శృంగార జీవితం తన మాటల్లో చెప్పేసింది. త్వరలోనే నేను తల్లిని కాబోతున్నాను. మాతృత్వం భావనను అందుకోవడానికి ఉత్సాహంగా ఉన్నాను అంటూనే తన భార్తతో శృంగార జీవితాన్ని చెప్పేసింది.

ఈ పరిస్థితుల్లో భార్య, భర్తలు కలుసుకోవద్దని
తన భర్త చిలిపి చేష్టల గురించి మాట్లాడుతూ.. 8 నెలల గర్బంతో ఉన్నప్పుడు భార్య, భర్తలు కలుసుకోవడం మంచి కాదని వైద్యుడు చెప్పారు. కానీ మా ఆయన ఊరుకోవడం లేదు. అయినా మేము కలుస్తూనే ఉన్నాం. కడుపులో ఉన్న బిడ్డపై ఎలాంటి ఒత్తిడి లేకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాం అని స్వాతి నాయుడు చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Recommended Video

మళ్లీ మేకప్ వేసుకొంటాను
ప్రసవం తర్వాత తాను యాక్టింగ్ కెరీర్‌ను కొనసాగిస్తానని చెప్పారు. బిడ్డ ఎదిగిన తర్వాత మళ్లీ మేకప్ వేసుకొంటాను. నటనతోపాటు ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇస్తాను. పెళ్లైనప్పటి నుంచి సంతానం కోసం పోరు పెడుతున్నాడు. అతడిని కోరికను తీర్చేందుకే తల్లిని అవుతున్నాను. మా ప్రేమకు ప్రతిరూపమైన చిన్నారి కోసం నేను అవినాష్ ఎదురుచూస్తున్నాం అని స్వాతి నాయుడు తన భవిష్యత్ ప్రణాళికను చెప్పారు.


Click it and Unblock the Notifications











