ఆమె కోరిక బయటపడబోతోంది.. యూట్యూబ్ శృంగారతార స్వాతి నాయుడు సంచలనం!
Recommended Video

యూట్యూబ్ శృంగార తార స్వాతినాయుడు మరో సంచలనానికి తెరతీసింది. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన స్వాతి నాయుడు గతంలో వెండి తెరపై కొన్ని పాత్రలు చేసింది. తాజాగా స్వాతి నాయుడు ప్రధాన పాత్రలో చిత్రం రూపొందబోతోంది. షకీలా తరహా ఇమేజ్ కోసం గతంలో స్వాతి నాయుడు ప్రయత్నించి విఫలం చెందింది. ప్రస్తుతం స్వాతి నాయుడు నటిస్తున్న చిత్రం కూడా శృంగారానికి సంబంధించినదే.

ఆమె కోరిక
స్వాతి నాయుడు నటిస్తున్న తాజా చిత్రం 'ఆమె కోరిక'. వల్లభనేని సురేష్ చౌదరి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్ ఆర్ మీడియా సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని చిక్కల సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

కథ ఇదే
అన్యోన్యంగా జీవనం సాగిస్తున్న భార్య భర్తల మధ్యలోకి అనుకోకుండా ఓ వ్యక్తి రావడంతో ఆ కుటుంబం ఎలా నాశనం అయింది అనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనిని బట్టి చూస్తుంటే అక్రమ సంబంధాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు అర్థం అవుతోంది.

గతంలో చాలా
ఈ తరహా కథాంశంతో చాలా చిత్రాలు వచ్చాయి. కానీ స్వాతి నాయుడు రొమాన్స్. నటన చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ తరహా పాత్ర వస్తే నిరూపించుకోవాలని స్వాతి నాయుడు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.

100 పైగా
ఆమె కోరిక చిత్రం ఈ నెల 10న విడుదల కాబోతోందని చిత్ర యూనిట్ ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని 100 పైగా థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











