అతడు నన్ను వాడుకొన్నాడు.. కరాటే కల్యాణికే నా సపోర్ట్.. స్వాతి నాయుడు షాకింగ్ ట్విస్ట్

కరాటే కళ్యాణి, శ్రీకాంత్ రెడ్డి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోలు చేసుకునే శ్రీకాంత్ రెడ్డి మీద కరాటే కళ్యాణి దాడి చేసిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆ వ్యవహారం మరుగునపడి కరాటే కళ్యాణి ఎవరినో అక్రమంగా దత్తత చేసుకున్నారనే వ్యవహారం తెరమీదకు వచ్చింది. అయితే నిన్న మొన్నటి వరకు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చిన స్వాతి నాయుడు ఇప్పుడు అనూహ్యంగా అతనికి షాక్ ఇచ్చి తన మద్దతు కరాటే కళ్యాణికే అంటూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

వీడియోలు చేయమని

వీడియోలు చేయమని


కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో యూట్యూబ్ ప్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ రెడ్డి మీద నటి, సామాజిక కార్యకర్తగా చెప్పుకుంటున్న కరాటే కళ్యాణి దాడి చేశారు. తనకు డబ్బులు ఇచ్చి వీడియోలు చేయమని అడగడంతోనే కోపం వచ్చి అలా చేశాను అని ఆమె చెప్పుకున్నారు. అయితే తనను కొట్టడంతో తాను కూడా ఆత్మరక్షణ కోసం దాడి చేశానని శ్రీకాంత్ రెడ్డి కూడా చెప్పుకొచ్చాడు.

దొంగ వ్యవహారాలనీ

దొంగ వ్యవహారాలనీ


వీరిద్దరూ ఒకరి మీద ఒకరు పోటాపోటీగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే ఈ వ్యవహారం మీద ముందు నుంచి కూడా స్వాతి నాయుడు, శ్రీకాంత్ రెడ్డి కి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా శ్రీకాంత్ రెడ్డి చేస్తున్నవన్నీ దొంగ వ్యవహారాలనీ స్వాతి నాయుడు ఆరోపిస్తున్నారు.

ముఖం మీద చెప్పా

ముఖం మీద చెప్పా


తనను పిలిపించుకుని వీడియోలు చేశారని వాళ్లకు కావలసిన విధంగా బోల్డ్ కంటెంట్ కోసం రకరకాల బట్టలు వేయించి రకరకాల బూతులు మాట్లాడించారని ఆమె చెప్పుకొచ్చారు. కరాటే కళ్యాణి గురించి కూడా తప్పుగా చెప్పమని తనను కోరారని అయితే తాను మాత్రం తనకు తెలిసినది మాట్లాడతాను తెలియనిది మాట్లాడను అని ముఖం మీద చెప్పానని ఆమె చెప్పుకొచ్చారు.

ఇంటర్వ్యూలు ఇవ్వకుండా

ఇంటర్వ్యూలు ఇవ్వకుండా


అయితే శ్రీకాంత్ రెడ్డి సహా కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు యూట్యూబ్ వీడియోలు చేసే వారంతా కలిసి పలు మీడియా ఛానల్స్ కు వెళ్లి తమ తమ వాదన గట్టిగా వినిపిస్తున్నారు, తాను తన వాదనలు వినిపించాలని అనుకుంటే శ్రీకాంత్ రెడ్డి అతని స్నేహితులు తనను మీడియాలో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కేవలం తనను బోల్డ్ వీడియోల వరకే పరిమితం చేశారని, బోల్డ్ వీడియోలు చేయించి తప్పించుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

 పూర్తి మద్దతు కరాటే కళ్యాణి అక్కకే

పూర్తి మద్దతు కరాటే కళ్యాణి అక్కకే


ఇదే విషయాన్ని కరాటే కళ్యాణితో చెబితే ఆమె సంతోషంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తాను ఎలాంటి తప్పు చేయలేదని తనతో అన్నారని ఆమె పేర్కొంది. ఆలోచిస్తే తనకు కూడా అదే నిజమనిపిస్తుంది అని స్వాతి నాయుడు చెప్పుకొచ్చారు.. సాధారణంగా ఎలాంటి తప్పు చేయను వారే ఇలా నిర్భయంగా ముందుకు రావడానికి సిద్ధమవుతారని, శ్రీకాంత్ రెడ్డి వాళ్లు తప్పు చేస్తున్నారు కాబట్టి తాను మీడియా ముందుకు వస్తాను అంటే వాళ్ళు భయపడుతున్నారని ఆమె ఆరోపించారు. తన పూర్తి మద్దతు కరాటే కళ్యాణి అక్కకే అంటూ స్వాతి నాయుడు ఈ సందర్భంగా వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X