లూజ్ క్యారెక్టర్... అందరితో పడుకుంటారనే మాట బాధించింది, మహేష్ బాబు చాలా విట్టీ: స్వాతి

Recommended Video

Swathi Says Mahesh Babu Is Witty | Filmibeat Telugu

రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న నెం.1 యారి కార్యక్రమానికి ఇటీవల తన కోస్టార్ నిఖిల్‌తో కలిసి హాజరైంది తెలుగు హీరోయిన్ స్వాతి. ఈ సందర్భంగా నిఖిల్, స్వాతి నుంచి రానా పలు ఆసక్తికర సమాధానాలు రాబట్టారు. ఇద్దరూ ఏ మాత్రం మొహమాట పడకుండా కొన్ని విషయాలపై ధైర్యంగా నోరు విప్పారు.

హీరో నిఖిల్ మన సిస్టంలో కొనసాగుతున్న రిజర్వేషన్ల గురించి మాట్లాడగా.... ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిల గురించి బయట ఎలా మాట్లాడుకుంటారు, అవి తమపై ఎలా ప్రభావం చూపుతాయో వెల్లడించే ప్రయత్నం చేసింది స్వాతి.

పేదవారికే రిజర్వేషన్లు ఇవ్వాలి

పేదవారికే రిజర్వేషన్లు ఇవ్వాలి

సమాజంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు ఏమిటి? అనే ప్రశ్నకు నిఖిల్ స్పందిస్తూ.... ఇది నేను చెప్పొచ్చో లేదో తెలియదు. మన సిస్టంలో రిజర్వేషన్స్ అనేవి కాస్ట్, రిలీజియన్ బేస్డ్ కాకుండా పేద వారికి ఇవ్వాలి. ఫైనాన్షియల్ స్థోమతను బట్టి అవి ఉంటే బావుంటుందని నా అభిప్రాయం. తక్కువ ఆదాయం ఉన్న వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి... అని నిఖిల్ అన్నారు.

అందువల్ల బచ్చా రోల్స్ ఎక్కువ రోజులు చేయగలను

అందువల్ల బచ్చా రోల్స్ ఎక్కువ రోజులు చేయగలను

నీలో మాత్రమే ఉన్న ఓ క్వాలిటీ ఏమిటి?..... నాకు మీసాలు, గడ్డాలు ఎక్కువగా పెరగవు. దీని వల్ల బచ్చా రోల్స్ ఎక్కువ రోజులు చేయగలుగుతాను. నాకు ప్లస్సయ్యే క్వాలిటీ అని నిఖిల్ అన్నారు.

 బయటకు వెళ్లిన తర్వాత నాకు ఫైర్ ఉంటుంది

బయటకు వెళ్లిన తర్వాత నాకు ఫైర్ ఉంటుంది

యాక్టింగ్ సిల్స్ ప్రకారం ర్యాంకులు ఇవ్వమని రానా కోరగా... అందరూ మంచి యాక్టర్లే, తప్పనిసరి ఇవ్వాల్సి వస్తే స్వాతి, రితూ, తమన్నా, కాజల్, హెబ్బకు ఇస్తాను. హెబ్బ మంచి యాక్టరే, తను అంతే... అమ్మో ఇపుడు హెబ్బా నుంచి ఫోన్ వస్తుందేమో? ఇది రాఫిడ్ ఫైరా? బయటకు వెళ్లిన తర్వాత నాకు ఫైర్ ఉంటుంది అంటూ నిఖిల్ ఫన్నీ కామెంట్స్ చేశాడు.

ఇండస్ట్రీలో అమ్మాయిలు లూజ్ క్యారెక్టర్, చాలా మంది మగాళ్లతో పడుకుంటారనేది...

ఇండస్ట్రీలో అమ్మాయిలు లూజ్ క్యారెక్టర్, చాలా మంది మగాళ్లతో పడుకుంటారనేది...

నిన్ను బాగా బాధించిన కామెంట్ ఏమిటని స్వాతిని అడ్డగా... ఇండస్ట్రీలో అమ్మాయిలకు లూజ్ క్యారెక్టర్ ఉంటుంది, చాలా మంది మగాళ్లతో పడుకుంటారనే కామెంట్ నన్ను చాలా బాధించింది.... అని స్వాతి తెలిపారు.

మహేష్ బాబు గురించి చాలా మందికి తెలియదు

మహేష్ బాబు గురించి చాలా మందికి తెలియదు

పవన్ కళ్యాణ్‌లో స్టైల్, యాటిట్యూడ్ నచ్చుతుంది. మహేష్ బాబు చాలా కామ్ అని బయట అనుకుంటారు. కానీ ఆయన ఎంత విట్టీ(చమత్కారం)గా ఉంటారో మనకు తెలుసు. అలా ఇమేజ్ మెయింటేన్ చేయడం అంత ఈజీ కాదు... అలాంటి క్వాలిటీ ఆయన నుంచి తీసుకుంటాను, జూ ఎన్టీఆర్ నుంచి టాలెంట్, ప్రభాస్ నుంచి హైట్, రానా... లవింగ్ నేచర్ తీసుకుంటానని స్వాతి సమాధానం ఇచ్చారు.

 ఫోన్ నెంబర్ ఇచ్చి తప్పు చేశా

ఫోన్ నెంబర్ ఇచ్చి తప్పు చేశా

టైమ్ ట్రావెల్ చేసే అవకాశం వస్తే ఏం చేస్తావు? అనే ప్రశ్నకు స్వాతి రియాక్ట్ అవుతూ.... వెనక్కి వెళ్లి వాట్స్ యువర్ నెంబర్ అంటే వారికి నెంబర్ ఇవ్వకుండా ఎరేజ్ చేస్తాను. ఇన్ స్టాగ్రామ్‌లో కొంతమందితో ఫ్రెండ్లీగా ఉండటం మానేస్తా, కొన్ని సినిమాలు తిరస్కరిస్తాను.... అని స్వాతి అన్నారు.

ఒక అమ్మాయితో వర్కౌట్ అయినట్లు మరొక అమ్మాయితో కావు

ఒక అమ్మాయితో వర్కౌట్ అయినట్లు మరొక అమ్మాయితో కావు

అమ్మాయిల గురించి అబ్బాయిలకు కచ్చితంగా తెలియాల్సిన విషయం..... ఒక అమ్మాయితో వర్కౌట్ అయినవి మరొక అమ్మాయితో కావు. అది నిజం. నా గురించి నేను గాసిప్ స్ప్రెడ్ చేయాల్సి వస్తే... ఒక సినిమాకు పెద్ద అమౌంట్ తీసుకున్నట్లు గాసిప్ స్ప్రెడ్ చేస్తాను అని స్వాతి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X