మేడే నే కలర్స్ స్వాతి కేక
కలర్స్ స్వాతి తన అభిమానులను మేడే రోజున వావ్ అనే కేకలు పెట్టించనుంది. ఆమె హీరోయిన్ గా చేసిన అనంతపురం 1980 చిత్రం మేడే రోజున రిలీజవుతోంది. ఆమె తమిళంలో చేసిన 'సుబ్రమణ్యపురం' చిత్రం 'అనంతపురం' టైటిల్ తో తెలుగులోకి అనువాదమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ఎమ్.రంగనాథ్ మాట్లాడుతూ "1980 సంవత్సరంలో జరిగిన సంఘటనలే మా చిత్ర కథ. నాటి వాతావరణాన్నీ, జీవన శైలినీ ప్రతిబింబిస్తుంది. అప్పటి యువకుల కేశాలంకరణలు, దుస్తుల్లో ఫ్యాషన్స్, అప్పటి సంగీతం...అన్నీ తెర మీద కనిపిస్తాయి. సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. అనంతపురం అనే పేరు ఉందని ఇదేదో ఫ్యాక్షన్ సినిమా అనుకోవద్దు. ప్రేమ, పగ, స్నేహం అనే అంశాల చుట్టూ తిరుగుతుందీ చిత్రం" అన్నారు. ఇక ఈ చిత్రానికి శశికుమార్ దర్శకుడు. మిగతా పాత్రల్లో జై, సముద్రకన్ని, గంజా కరుప్పు చేసారు. ఈ చిత్రంలో స్వాతి మంచి అబినయంతో పాటు లంగా వోణి వేసుకుని కవ్వించనుంది. ఈ చిత్రంపై ఆమె చాలా ఎక్సెప్టేషన్స్ పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











