Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
టాలీవుడ్‌ను షేక్ చేయనున్న ఫారిన్ మోడల్
టాలీవుడ్ ను షేక్ చేసేందుకు వస్తోంది మరో ఫారిన్ మోడల్. పేరు మరియమ్ జక్రియ. తన హాట్ హాట్ అందాలతో ఇప్పటికే కుర్రకారు మతిపోగొడుతున్న జక్రియ ఇటీవల నాగచైతన్య హీరోగా విడుదలైన 100% లవ్ చిత్రంలో దియ్యాలో దియ్యాలో మెరిసి అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే బాలీవుడ్ లో అడుగిడిన స్వీడన్ కు చెందిన ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ లో సెటిలయ్యేందుకు సన్నాహాలు చేస్తోంది. అల్లరి నరేష్ తాజా చిత్రం 'మడత కాజ" చిత్రంలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది.
తెలుగులో నటించడంపై మరియమ్ మాట్లాడుతూ...ఇండియాలో నాకు హైదరాబాద్ రెండో ఇల్లు కాబోతోంది, ముంబై తరువాత నాకు బాగా నచ్చిన నగరం ఇది. అక్కడ బాలీవుడ్, ఇక్కడ టాలీవుడ్లో మంచి అవకాశాలు వస్తున్నాయని, ఇప్పుడిప్పుడే తెలుగు కూడా నేర్చుకుంటున్నాను అంటూ చెప్పుకొస్తోంది. ఐటం సాంగులకే పరిమితం కాకుండా, నటన విషయంలో తన సత్తా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తానని అంటోంది.
గత కొంత కాలంగా మన తెలుగు సినిమాలతో పాటు, బాలీవుడ్ సినిమాల్లో కూడా ఫారిన్ పాపల జోరు పెరుగుతోంది. కథలో భాగంగా ఫారిన్ పాపల అవసరం తప్పనిసరవుతోంది. ఇటీవల మన తెలుగులో వచ్చిన 'తీన్మార్" సినిమానే తీసుకుంటే పవన్ కళ్యాన్ సరసన ఓ ఫారిన్ భామ నటించిన విషయం తెలిసిందే. ఇటాలాంటి కథలు ఇటీవల బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా ఎక్కువవుతోంది. ఇవి కాకున్నా ఐటం సాంగుల అవకాశాలు బోలెడు. ఈ నేపథ్యం మరియమ్ కెరియర్ కి ఢోకా లేదనే చెప్పాలి.