రామ్ చరణ్ అలా చేయడంతో మురిసిపోయిన ఉపాసన
స్కూల్ డేస్ నుంచి స్నేహితులైన రామ్ చరణ్, ఉపాసన వివాహంతో తమ బంధాన్ని మరింత బలపరుచుకున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ. రామ్ చరణ్ ఉపాసన మీద ఉన్న ప్రేమను బహిరంగంగా... తన అభిమానులకు తెలిసేలా వ్యక్త పరచక పోయినా .... ఉపాసన మాత్రం చెర్రీ తనపై ప్రేమతో చేసిన పనులు గురించి సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఎంటర్టెన్ చేస్తూ ఉంటుంది.
తాజాగా ఉపాసన పోస్టు చేసిన ఓ ఫోటో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. తన కోసం బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కొని తీసుకొస్తున్న చెర్రీ ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ సంతోషంతో మురిసిపోయింది. ఫ్యాన్స్ పోస్టును లైకులు, కామెంట్లతో ముంచెత్తడంతో ట్విట్టర్లో వైరల్ అయింది.
రామ్ చరణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. ఫ్యాన్స్‌తో కనెక్ట్ అయ్యేందుకు ఉన్న ఫేస్ బుక్ పేజీలో కూడా ఎప్పుడో ఒకసారి తప్ప పెద్దగా పోస్టులు కూడా చేయరు. ఆలోటును తీరుస్తూ రామ్ చరణ్ తరుపున విషయాలు కూడా తానే వెల్లడిస్తూ, తమ పర్సనల్, ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించిన విషయాలు పంచుకుంటూ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ బిజినెస్ ఉమెన్.

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.... ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











