శ్వేతా బసు: కన్సల్టెంటుగా కొత్త అవతారం
హైదరాబాద్: తెలుగు హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ఇటీవల సెక్స్ రాకెట్లో పట్టుబడి రెస్క్యూ హోంలో గడిపిన అనంతరం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉంటోంది. ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమా అవకాశాలు లేని ఆమెకు కొత్త జాబ్ దొరికొంది. బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అయిన పాంటమ్ ప్రొడక్షన్స్‌లో స్క్రిప్టు కన్సల్టెంటుగా చేరింది.
ఈ విషయం గురించి శ్వేతా బసు మాట్లాడతూ...‘అవును నేను పాంటమ్ ప్రొడక్షన్లో స్కిప్టు కన్సల్టెంటుగా చేరాను. ఈ జాబ్ నాకు కెరీర్ పరంగా ఉపయోగ పడుతుంది. ' అని శ్వేతా బసు చెప్పుకొచ్చారు. మొత్తానికి శ్వేతా బసుకు మళ్లీ ఈ జాబ్ రూపంలో జీవనాధారం దొకరడంపై ఆనందంగా ఉంది.

కాగా...ఇటీవల శ్వేతా బసుకు హన్సల్ మెహతా డాక్యుమెంటరీలో నటించే అవకాశం వచ్చిందనే వార్తలు వచ్చిన సంగగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను శ్వేతా బసు ఖండించింది. నేను హన్సల్ మెహతాను కలిసిన మాట వాస్తవమే. కానీ హిందూస్థానీ క్లాసికల్ మ్యూజిక్ పై తీస్తున్న డాక్యుమెంటరీలోనేను నటించం లేదు' అని తెలిపారు.
వాస్తవానికి ఈ డ్యాక్యుమెంటరీలో శ్వేతా బసు చేయాల్సిన పాత్ర ఏమీ లేదట. త్వరలోనే ఆమెకు అవకాశం ఇస్తానని హన్సల్ మెహతా మాట ఇచ్చారు. ఆ అవకాశం కోసం శ్వేతా బసు ఎదురు చూస్తోంది.


Click it and Unblock the Notifications











