అన్యాయం చేసాడు...శ్వేతాబసు
రైడ్ చిత్ర దర్శకుడు రమేష్ వర్మపై ఆ చిత్ర హీరోయిన్ శ్వేతాబసు మండిపడుతోంది. కొత్త బంగారు లోకం చిత్రంలో తాను హైలెట్ అయినట్లుగా ఈ రైడ్ లో కాకపోవటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. అందులోనూ మరో హీరోయిన్ ఉండటం, కథ, కథనాలు తన చుట్టూ తిరగకపోవటాన్ని ఆమె ప్రస్ధావిస్తోంది. అయితే అది ఆమెకు షూటింగ్ కు ముందు తెలియదంటోంది. నాతో రమేష్ వర్మ చెప్పింది వేరు..చివరకు తీసింది వేరు..అయినా ఇలా స్క్రిప్టుని షూటింగ్ జరుగుతూండగా మార్చెవాళ్ళంటే నాకు గిట్టదు. కొత్త బంగారులోకం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథ చెప్పినట్లు తీసాడు. స్క్రిప్టును ఓ చంటి బిడ్డలా చూసుకున్నాడు. అదే రమేష్ వర్మ దగ్గరకు వచ్చేసరికి తారుమారు అయ్యింది. అతనికి స్పాంటినిటి ఎక్కువ. సెట్ మీదే కథ, కథనాలు మార్చేస్తూంటాడు. ముందునుకున్నదేదీ తెరకెక్కదు. తనిష్టం వచ్చినట్లు మార్చేసాడు అంటూ వ్యంగ్యాస్తాలు చిందించింది. బాలకృష్ణతో కమిట్ అయిన భీష్మ చిత్రంలో ఆమెకు చోటు ఇస్తారని ఆమె బావించిందని అయితే అది జరిగేలా లేకే ఇలా మాట్లాడుతోందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











