twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యభిచార కేసులో ఇరుక్కున్న రాత్రి అసలేం జరిగిందో...వివరించిన శ్వేతబసు

    By Srikanya
    |

    హైదరాబాద్ : శ్వేతాబసు ప్రసాద్.. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో ఓ మెరుపు మెరిసి మెరిపించిన నటి. బాలనటిగా బాలీవుడ్ సినిమాల ద్వారా జాతీయ పురస్కారం అందుకొంది. 'కొత్త బంగారు లోకం'తో తెలుగు సినీ లోకానికి పరిచయమైంది. ఆ. తర్వాత వ్యభిచార కేసులో ఇరుక్కొని హాట్ టాపిక్ గా నిలిచింది.

    <strong>ప్రేమలో శ్వేతబసు...బోయ్ ఫ్రెండ్ తో ఇలా (లీక్ ఫొటోలు)</strong>ప్రేమలో శ్వేతబసు...బోయ్ ఫ్రెండ్ తో ఇలా (లీక్ ఫొటోలు)

    స్టార్ హోటల్లో శ్వేతను అదుపులోకి తీసుకోవటం.. ఎర్రమంజిల్ కోర్టు ఆదేశాలతో రెస్క్యూ హోంకు తరలించటం.. తర్వాత నాంపల్లి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం లాంటివి ఒకటి తర్వాత ఒకటిగా జరిగిపోయాయి. అనంతరం ఆమె తన ఊరికి వెళ్లిపోయారు.

    శ్వేతబసు ఉన్న ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవటం ఖాయం...(వీడియో,ఫొటోలు)శ్వేతబసు ఉన్న ఈ వీడియో చూస్తే మీరు షాక్ అవటం ఖాయం...(వీడియో,ఫొటోలు)

    ఇదంతా జరిగి దాదాపు రెండేళ్లు అవుతోంది. అయితే ఆమెను ఇప్పటికీ గతం వెంటాడుతూనే ఉంది. ఈ నేఫద్యంలో ఆమె అసలు ఆ రాత్రి ఏం జరిగిందో ఓ పాపులర్ మీడియా ద్వారా మన ముందు ఉంచే ప్రయత్నం చేసారు. ఆ సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. ఆమె మాటల్లోనే సాగుతుంది మీరు చదవేదంతా...

    ప్లైట్ మిస్సవటమే...

    ప్లైట్ మిస్సవటమే...

    నిజానికి 'సంతోషం' సినీవార పత్రిక అవార్డుల వేడుకలో పాల్గొనడానికి శ్వేత హైదరాబాద్ వచ్చారు. ఇక్కడి స్టార్ హోటల్‌లో బస చేశారామె. అవార్డు ప్రదానోత్సవం పూర్తి కాగానే ముంబై వెళ్లిపోవాలనుకున్నారు. కానీ, శ్వేత ఫ్లైట్ మిస్ అయ్యారు. దాంతో హోటల్‌లోనే ఉండిపోయారు. ఆ సమయంలో హోటల్‌పై పోలీసులు దాడి చేయడం, అరెస్ట్ చేయడం జరిగాయి.

    ఏ నటి వ్యభిచారంలో పట్టుబడినా...

    ఏ నటి వ్యభిచారంలో పట్టుబడినా...

    రెండేళ్ల క్రితం మీ జీవితంలో జరిగిన ఆ సంఘటన ఇంకా వెంటాడుతోంది. ప్రాస్టిట్యూషన్ కేసులో ఏ నటి పట్టుబడినా కొందరు ఉదాహరణగా నా పేరు లాగుతున్నారంటే ... నేను పాపులర్ అని అర్థం. నా పేరు స్పెల్లింగ్ బాగుందనీ, నా ఫొటోలు బాగున్నాయనీ అర్థం (నవ్వేస్తూ). నన్ను ఎగ్జాంపుల్‌గా తీసుకునే వాళ్ల గురించి వదిలేద్దాం.

    నోళ్లు మూయించలేం

    నోళ్లు మూయించలేం

    మీడియా నాకు సపోర్ట్‌గానే ఉంది. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు 'కంగ్రాట్స్' అంటుంటారు. నా మంచి కోరుకునే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. నాకు వాళ్లు చాలు. ఎవరేం మాట్లాడుకున్నా పట్టించుకోను. అయినా మాట్లాడేవాళ్ల నోళ్లు మూయించలేం. ఎవరి సంస్కారం వాళ్లది అంది శ్వేతబసు.

    నా సక్సెస్ కు దిష్టి..

    నా సక్సెస్ కు దిష్టి..

    సమస్యలు కామన్ . సెలబ్రిటీల జీవితంలోనూ తప్పవు. నా లైఫ్‌లో ఇప్పటివరకూ నేను ఎదుర్కొన్న సమస్యలన్నీ నా సక్సెస్‌కి దిష్టిలా భావిస్తున్నాను. చిన్న వయసులోనే పెద్ద పెద్ద విజయాలు చూశాను. ఆ విజయాల ముందు నేను ఎదుర్కొన్న సమస్యలు చాలా చిన్నవి. ఇప్పుడు లైఫ్ అంటారా.. చాలా ప్రశాంతంగా ఉంది. వెరీ కూల్.

    పెద్దయ్యాకే..

    పెద్దయ్యాకే..

    నా బాల్యం సో స్వీట్. స్కూల్లో మంచి మార్కులొచ్చేవి. ఆర్టిస్ట్‌గా మంచి పేరొచ్చింది. నాది మంచి ఫ్యామిలీ. ఇన్ని తియ్యని విషయాలున్నాయి. పెద్దయ్యాక చిన్న చేదు అనుభవం. ఇప్పుడు చేస్తున్న 'మిక్సర్ పొట్లం' సినిమా టైటిల్ నా లైఫ్‌కి వర్తిస్తుంది. నా లైఫ్‌లో టూ మచ్ స్వీట్, చిన్నపాటి కారం ఉంది. నో ప్రాబ్లమ్.

    మాట్లాడే హక్కు ఉంది మాట్లాడుతున్నారు

    మాట్లాడే హక్కు ఉంది మాట్లాడుతున్నారు

    'మీరిలా మాట్లాడొద్దు' అని నేనెవరితోనూ అనలేను. అలా చెప్పాలంటే ఎంతమందికి చెప్పాలి? అయినా ఎందుకు చెప్పాలి? మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది కదా. మాట్లాడనివ్వండి అని ఆవేదనగా శ్వేతబసు అన్నారు.

    కాంట్రవర్శినే కాకుండా..

    కాంట్రవర్శినే కాకుండా..

    ఆ సంగతి పక్కన పెడితే.. నా గురించి మంచి విషయాలు మాట్లాడేవాళ్లూ ఉన్నారు. ఏదైనా కాంట్రవర్శీ వచ్చినప్పుడు దాన్ని ఫోకస్ చేసిన మీడియా ఆ తర్వాత నా గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడింది. ఇలా మంచి విషయాలు మాట్లాడేవాళ్లూ ఉన్నారు. అది చాలు.

    నాకు ఏడవటం ఇష్టం లేదు..

    నాకు ఏడవటం ఇష్టం లేదు..

    నా జీవితంలో జరగకూడనిది జరిగినప్పుడు నా కంటి నుంచి ఒక్క చుక్క కూడా రాలేదు. నాకు ఏడవడం అంటే ఇష్టం ఉండదు. అంతా జరిగి రెండేళ్లయింది. ఇంకా ఎందుకు? మళ్లీ మళ్లీ మాట్లాడుకోవడంలో అర్థం లేదు.

    నా విషయంలో న్యాయవ్యవస్ద మాత్రం

    నా విషయంలో న్యాయవ్యవస్ద మాత్రం

    న్యాయస్థానం గురించి ఓ విషయం చెబుతాను. ఇండియాలో ఏ కేసుకైనా తీర్పు దొరకాలంటే ఏళ్లు పడుతుంది. కానీ, నిందితురాలిగా ముద్రపడి, నేను న్యాయస్థానం ముందుకొచ్చిన రెండే వారాల్లో నాకు 'క్లీన్ చిట్' ఇచ్చారు.

    వాళ్లను ఫూలిష్ అనటం తప్ప..

    వాళ్లను ఫూలిష్ అనటం తప్ప..

    కోర్ట్ క్లీన్ చిట్ ఇవ్వగానే.. నాకు మొదట శుభాకాంక్షలు చెప్పింది హైదరాబాద్ పోలీసే. న్యాయస్థానమే తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకా ఆ విషయం గురించి ఏదేదో మాట్లాడుతున్నవాళ్లను 'ఫూలిష్' అనడం మినహా నేనేం చేయలేను.

    ఈ గ్యాప్ లో ఏం చేసానంటే..

    ఈ గ్యాప్ లో ఏం చేసానంటే..

    గడచిన మూడేళ్లల్లో తెలుగులో కనిపించలేదు. ఈ గ్యాప్‌లో మాస్ కమ్యూనికేషన్ కోర్స్ చేశా. ఇప్పుడు నేను క్వాలిఫైడ్ జర్నలిస్ట్‌ని . ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం మీద 'రూట్స్' పేరుతో ఓ డాక్యుమెంటరీ తీశా.

    షార్ట్ ఫిల్మ్ లో ..

    షార్ట్ ఫిల్మ్ లో ..

    అలాగే 'ఇంటీరియర్ కేఫ్ నైట్' పేరుతో ఓ షార్ట్ ఫిలిం నిర్మించి, యాక్ట్ చేశాను. నసీరుద్దిన్ షా కూడా నటించారు. ఆల్రెడీ ఆన్‌లైన్‌లో ఈ షార్ట్ ఫిలింకి 1 మిలియన్ హిట్స్ దాటాయి.

    కరణ్ జోహార్ ప్రారంభించిన

    కరణ్ జోహార్ ప్రారంభించిన

    ధర్మ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ ప్రారంభించిన 'బద్రీనాథ్ కీ దుల్హనియా'లో నటిస్తున్నాను. ఈ మూడేళ్లల్లో నేను తెలుగు స్క్రీన్ మీద కనిపించలేదు కానీ బిజీగానే ఉన్నాను. కొంచెం ఫ్రీ అవుతున్న సమయంలో దర్శకుడు సతీష్ కలసి 'మిక్చర్ పొట్లం' కథ చెప్పారు. తెలుగుకి మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందని ఒప్పుకున్నాను.

    దైవభక్తి ఉందా?

    దైవభక్తి ఉందా?

    నేను పుట్టింది బిహార్‌లో అయినా చదువుకున్నదీ, ఉంటున్నదీ ముంబైలోనే. షిర్డీ ఎలానూ దగ్గర కాబట్టి మా అమ్మానాన్నతో కలసి చాలాసార్లు వెళ్లాను. అక్కడికెళ్లగానే ప్రశాంతంగా అనిపిస్తుంది.

    ఇప్పుడు బేబీ ప్యాట్ పోతోంది

    ఇప్పుడు బేబీ ప్యాట్ పోతోంది

    'కొత్త బంగారు లోకం' చేసినప్పుడు నేను టీనేజ్ పాపని (నవ్వుతూ). నా వయసప్పుడు 18. ఇప్పుడు 25. ఏజ్ పెరిగేకొద్దీ బేబీ ఫ్యాట్ పోతుంది. టీనేజ్ ఫ్యాట్ అంతా పోయిన తర్వాత ఫిజిక్ మెయిన్‌టైన్ చేయడానికి ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను.

    నేను ఎవర్నీ తప్పుపట్టను

    నేను ఎవర్నీ తప్పుపట్టను

    నాకు జిమ్ అంటే ఇష్టం ఉండదు. అందుకే యోగా చేయడం మొదలుపెట్టాను. రోజూ 30 సూర్య నమస్కారాలు చేస్తాను. మజిల్స్ రిలాక్సేషన్ కోసం కొంతమంది మసాజులు చేయించుకుంటారు. ఎవరిష్టం వాళ్లది కాబట్టి, నేనెవర్నీ తప్పుబట్టడంలేదు. కానీ, ఎప్పుడో వారానికో లేక పది రోజులకో చేయించుకునే మసాజులకన్నా డైలీ యోగా చేయడం బెటర్ అని నేనంటాను. యోగాకి కూడా మజిల్స్‌ని రిలాక్స్ చేసే పవర్ ఉంది. ఫిజికల్‌గా, మెంటల్‌గా బాగుంటుంది.

    ఏక్తాకపూర్ సంస్దకు

    ఏక్తాకపూర్ సంస్దకు

    తెలుగులో ఒక సినిమా, హిందీలో ఒకటి చేస్త్తూనే, 'చంద్ర నందిని' అనే హిందీ టీవీ సీరియల్ చేస్తున్నా. అది మంచి హిస్టారికల్ సీరియల్. బాలాజీ టెలీఫిలింస్ ఏక్తా కపూర్ నిర్మాత. ఈ సంస్థకు ఇంతకు ముందు కూడా సీరియల్స్ చేశా.

    ఏదీ తేడా ఉండదు

    ఏదీ తేడా ఉండదు

    ఇందులో నేను వారియర్ ప్రిన్సెస్‌ని. చాలెంజింగ్ రోల్. అందుకే ఒప్పుకున్నా. ఈ పాత్ర కోసం గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధం నేర్చుకున్నాను. ముంబైలో సినిమా, టీవీ, వెబ్ సిరీస్ అనే తేడా ఉండదు. అందరూ అన్నీ చేస్తారు. అది అడ్వాంటేజ్. పైగా ఇది రెగ్యులర్ అత్తా-కోడళ్ల గొడవలతో సాగే సీరియల్ కాదు. తెలుగులో 'సూపర్ 2' షో కూడా చేశాను. యాజ్ యాన్ యాక్టర్ మంచి ప్రాజెక్ట్ ఏది వచ్చినా చేస్తాను.

    పెళ్లి ఇప్పట్లో లేదు కానీ..

    పెళ్లి ఇప్పట్లో లేదు కానీ..

    టూ ఎర్లీ. ఇప్పట్లో ప్లాన్స్ లేవు. ఓన్లీ కెరీర్ మీదే దృష్టి పెట్టాను. నాకు రైటింగ్ అంటే ఇష్టం. సీతాకోక చిలుకను చూసినప్పుడో, పచ్చని చెట్టు కనిపించినప్పుడో, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి తారస పడినప్పుడో కవిత వచ్చేస్తుంది. ఇప్పటివరకూ చాలా రాశా. రాస్తూనే ఉంటా. భవిష్యత్తులో ఆ కవితలతో పుస్తకం వేస్తానేమో.

    మా అమ్మా,నాన్నా వద్దన్నారు

    మా అమ్మా,నాన్నా వద్దన్నారు

    మా అమ్మానాన్న నన్ను డబ్బు సంపాదించే మెషిన్‌లా చూడలేదు. నా చదువు కోసం, నా బాల్యాన్ని నేను సంతోషంగా అనుభవించడం కోసం సినిమాలు వద్దన్నారు. ఐయామ్ గ్రేట్‌ఫుల్ టు మై పేరంట్స్. 'కొత్త బంగారు లోకం' కథ విన్నప్పుడు 'హీరోయిన్‌గా ఇలాంటి సినిమాతోనే పరిచయం కావాలి' అని ఒప్పుకున్నారు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలన్నారు. అమ్మానాన్నలు చెప్పినట్లే చేశాను.

    English summary
    "That day I'm in Hyderabad to attend Santosham awards function. Later missed my flight back home. And when I came back to a Star Hotel to rest, there was a police raid and they arrested me on various charges" said Swetha, talking about that night.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X