కాసుకో అంటున్న శ్వేతాబసు
కొత్తబంగారు లోకంతో పరిచయమై రైడ్ తో అదరకొట్టిన శ్వేతాబసు తాజాగా కాసుకో అంటూ సవాల్ విసరబోతోంది. ప్రముఖ దర్శకుడు ఎ.కోదండ రామిరెడ్డి కుమారుడు వైభవ్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి(సీమ శాస్త్రి దర్శకుడు) కాంబినేషన్లో రెడీ అవుతున్న కొత్త చిత్రానికి కాసుకో అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. దాదాపు తొంభై శాతం పూర్తయిన ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఎ.భారతి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోదండరామిరెడ్డి తన కె.ఫిల్మ్స్ పై సమర్పిస్తున్నారు. వైభవ్ గతంలో గొడవ, సరోజ చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. బ్రహ్మానందం, సలీమ్, శ్రీనువాసరెడ్డి, జయప్రకాష్ రెడ్డి, అజాద్ వంటి వారు నటిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ గానే తెరకెక్కుతోంది. అలాగే ఈ చిత్రం అధ్బుతమైన విజయాన్ని సాధిస్తుందని దర్శక, నిర్మాతలు ఎప్పటిలాగానే భావిస్తారు.
swetha basu vaibhav kasuko kodandarami reddy bharathi nageswara reddy ride kothabangarulokam గొడవ సరోజ కొత్తబంగారు లోకం రైడ్ శ్వేతాబసు కాసుకో ఎకోదండ రామిరెడ్డి


Click it and Unblock the Notifications